2021 సంవత్సరానికి గాను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘టిటిఎ’ బోర్డు సమావేశం ఈరోజు శనివారం డెట్రాయిట్లో విజయవంతంగా జరిగింది. ఈ ముఖాముఖీ సమావేశానికి అమెరికా నలుమూలల నుండి టిటిఎ నాయకులు నిన్న శుక్రవారమే తరలివచ్చారు. నిన్న సాయంత్రం టిటిఎ లీడర్షిప్ తో మీట్ అండ్ గ్రీట్, ఈరోజు ఉదయం బోర్డు సమావేశం, అలాగే సాయంత్రం కల్చరల్ ఈవెంట్ నిర్వహించారు.
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ‘టిటిఎ‘ అధ్యక్షులు డాక్టర్ పటలోళ్ళ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో లీడర్షిప్ అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. కోవిడ్ తదనంతరం జరుగుతున్న ఈవెంట్ కావడంతో టిటిఎడెట్రాయిట్ చాప్టర్ లీడర్షిప్ చక్కని ప్రణాళికతో స్థానిక మారియట్ హోటెల్లో గ్రాండ్ గా ఏర్పాట్లు చేసారు. టిటిఎ జాతీయ సమన్వయకర్త ఆఎక్క వెంకట్ ఈ కార్యక్రమ నిర్వహణలో తోడ్పడ్డారు. 2022లో న్యూజెర్సీలో నిర్వహించతలపెట్టిన మెగా కన్వెన్షన్ గురించి విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తుంది. బోర్డు సమావేశానంతరం సాయంత్రంనిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే టిటిఎ ఉపశీర్షికను నిజమనిపించేలా అందరిని అలరించాయి.
కోవిడ్ మహమ్మారి సమయంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, అంబులెన్స్, ఇతరత్రాసేవలు అందించి సుమారు 200 మందికి పైగా ప్రాణాలను కాపాడిన టిటిఎ టాస్క్ ఫోర్స్ టీం ని ఈ వేదికపై ఘనంగా సత్కరించారు. అలాగే టిటిఎ సేవలను మరింతమందికి దరిచేరేలా సాంకేంతికంగా ఒక యాప్ ని కూడా ఆవిష్కరించడం విశేషం.
హాజరైన వారిలో ముఖ్యంగా టిటిఎవ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, గత అధ్యక్షులు మరియు అడ్వైజరీ కౌన్సిల్ కో ఛైర్ డాక్టర్ పోలిచెర్ల హరనాథ్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ వంశీ రెడ్డి, టీవీ5 సీఈఓ చిల్లర శ్రీధర్, అట్లాంటా నుంచి లాస్ట్ టర్మ్ ప్రెసిడెంట్ మాదాడి భరత్ రెడ్డి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గడ్డంవెంకట రమణా రెడ్డి, అలాగేకార్యదర్శి శ్రీనివాస మనప్రగడ, అంతర్జాతీయ ఉపాధ్యక్షులు గోలి నవీన్, కాన్సస్ సిటీ నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చీదెళ్ళబిందు లత తదితరులు ఉన్నారు.