Bathukamma
అమెరికా అంతటా టిటిఎ బతుకమ్మ & దసరా సంబరాల కోలాహలం: Telangana American Telugu Association
Published
3 years agoon
By
NRI2NRI.COMతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఏళ్ళ తరబడి అమెరికాలో చాటుతున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association – TTA) ప్రతి ఏడాదిలాగే ఈ ఏడు కూడా ప్రెసిడెంట్ డా. మోహన్ రెడ్డి పట్లోళ్ల అధ్యక్షతన అమెరికాలోని నలుమూలల మిన్నంటే సంబరాలతో బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది.
న్యూయార్క్ నగరంలో:- తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) ఫౌండర్ డా’ పైళ్ల మల్లారెడ్డి, సొంత నగరమైన న్యూయార్క్ లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. లాంగ్ ఐలాండ్ లోని రాడిసన్ హోటల్ లో రెండు వేలకు పైగా అతిథులతో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంది. సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికను అమ్మవారు అధిరోహించగా భక్తిశ్రద్ధలతో సాగిన లలిత పారాయణం, న్యూ యార్క్ ఆడపడుచుల ఆటపాటలు, చిన్నారుల నృత్యాలు, షడ్రుచులతో కూడిన రుచికరమైన పండగ విందు భోజనాలతో నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఈ వేడుకలు జరిగాయి. సహచర సంఘమయిన న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) మరియు తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (TLCA) తోడ్పాటు అందించాయి.

ఈ వేడుకలకు న్యూ యార్క్ లోని ప్రముఖులు విచ్చేసి కార్యక్రమాలను అధ్బుతంగా నిర్వహించిన TTA కార్యావర్గాన్ని అభినందించారు. ఉదయం పది నుండి సాయంత్రం 4 గంటల వరకు సాగిన కార్యక్రమంలో బతుకమ్మ, దాండియా నృత్యాలతో ఆడపడుచులు సందడి చేశారు. ఈ వేడుకలలో అతిథులు ఉత్సాహంగా రూపొందించి తీసుకొచ్చిన బతుకమ్మలను ఒక్క చోట అలంకరించి బెస్ట్ బతుకమ్మ పోటీలు నిర్వహించారు. బతుకమ్మ నిమజ్జనం ఆటహాసంగా జరిగింది. అనంతరం, పవన్ రవ్వ, మాధవి సోలేటి, అశోక్ చింతకుంట, రమ వనమా, వాణి సింగిరికొండ, ఉష మన్నెం, మల్లిక్ రెడ్డి, సహొదర్, శ్రీనివాస్ గూడూరు, యోగి వనమా, సునీల్ రెడ్డి, సత్య గగ్గినపల్లి, శరత్ వేముగంటి, సత్య రెడ్డి, ప్రహ్లాద. సౌమ్య చిత్తరి కార్యవర్గం కార్యక్రమానికి ఆర్ధిక సహకారం అందించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వేదిక పైకి ఆహ్వానించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రముఖ గాయని స్పూర్తి జితేందర్ తన జానపద పాటలతో న్యూ యార్క్ బతుకమ్మకు సందడి తీసుకొచ్చింది.
న్యూ జెర్సీ నగరంలో:- తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) ప్రెసిడెంట్ డా. మోహన్ రెడ్డి పట్లోళ్ల గారి సొంత రాష్ట్రం మరియు అమెరికాలోనే అతి ఎక్కువ తెలంగాణ, తెలుగు వారు నివసించే న్యూ జెర్సీ నగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా బతుకమ్మ సంబురాలు మిన్నంటాయి. ప్రతి ఏడాది అమెరికాలోనే అతి పెద్దది మరియు అరుదైన బంగారు బతుకమ్మను న్యూజెర్సీ టిటిఎ సభ్యులు ఈ సంవత్సరం కూడా చాలా గొప్పగా బంగారు బతుకమ్మను పేర్చారు. అంగరంగ వైభవంగా ఉడ్రో విల్సన్ మిడిల్ స్కూల్ లో షుమారు రెండు వేల మంది తెలంగాణ ఆడపడుచులు జోరు వానలో సైతం బతుకమ్మలతో వేదికకు తరలి వచ్చారు.

ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు గౌరి పూజతో ప్రారంభమై బతుకమ్మ ఆట పాటలతో న్యూజర్సీ ఎడిసన్ నగరమంతా మారుమ్రోగిపోయింది. టిటిఎ న్యూ జెర్సీ కార్యవర్గ సభ్యులు ఆహూతులకు చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు. సాయంత్రం బతుకమ్మలను సాగనంపే కార్యక్రమం కూడా ఎంతో చూడ ముచ్చటగా సాగింది. షుమారు ఆరు గంటల పాటు ఎంతో కోలాహలంగా సాగిన బతుకమ్మ ఉత్సవాలకు ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, శ్రీనివాస్ గన్గొని, శివ రెడ్డి కొల్ల, నరసింహ పెరుక, కిరణ్ దుద్దగి, గంగాధర్, సతీష్, విజయ్ భాస్కర్, నరేందర్ యారవ మరియు కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. స్వాతి రెడ్డి బతుకమ్మ ఆటాపాట లతో అలరించింది.
ఇండియానాపోలిస్:- తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) అడ్వైసరీ చైర్ డా విజయపాల్ రెడ్డి సొంత నగరమైన ఇండియానాపోలిసులో అడ్వైసరి చైర్ డా విజయపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కవిత రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వెస్ట్ఫిల్డ్ నగరంలోని కారి రిడ్జ్ ఎలిమెంటరీ స్కూల్ నందు తెలంగాణ తెలుగు మహిళలంతా షుమారు వెయ్యి మందికి పైగా బతుకమ్మ లను పేర్చి తెచ్చి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు.

ఇండియానాపోలీసులో ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ జరగటం ఇదే మొధటిసారి. జనం నలుమూలలనుండి పోటెత్తారు. జనమంతా చుట్టూ చేరి గౌరమ్మ బతుకమ్మ పాటలతో సాయంత్రం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు వివిధ కార్యక్రమాలతో నగరమంతా సందడిగా మారింది. బంగారు బతుకమ్మను పేర్చి తెచ్చిన వారికి, తెలంగాణ కట్టు బొట్టుకూ మరియు బతుకమ్మను కొలిచే విద్ధానం తెలిసిన వివిధ మహిళామణులకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. శోభా రెడ్డి మరియు హరీష్ రెడ్డి కాంతాల ఏర్పాటు చేసిన చక్కటి విందు భోజనమును అందరూ ఆస్వాదించారు.
డెట్రాయిట్:- తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) అడ్వైసరీ కో చైర్ డా’ హరనాథ్ పొలిచెర్ల గారి సొంత నగరమైన డెట్రాయిట్లోని ఫార్మింగ్టన్ హిల్స్ లో నేషనల్ కో ఆర్డినేటర్ వెంకట్ ఎక్క ఆధ్వర్యంలో షుమారు అయిదు వందల మంది మహిళామణులు చేరి అమ్మవారిని గౌరి పూజ, కోలాటాలతో, బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శనివారం సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమైన ఉత్సవాలు ఎనిమిది గంటలవరకు వివిధ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు మరియు బంగారు బతుకమ్మలను పేర్చి తెచ్చి పాల్గొన్న డెట్రాయిట్ ఆడపడుచులందరికి చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు.

సియాటెల్:- వాషింగ్టన్ లోని సియాటెల్ (పసిఫిక్ వాయవ్యం) నగరం లో (తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) ప్రెసిడెంట్ ఎలెక్ట్ వంశీ రెడ్డి, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ గోలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గణేష్ వీరమనేని , మనోహర్ బోడ్కే, సంగీత బొర్రా, అజయ్ రెడ్డి, శ్రీధర్ చదువు, మాణిక్యం తుక్కాపురం, శ్రీధర్ ప్రతికాంతం, రవీందర్ వీరవల్లి, సాయి రెడ్డి చంద్ర సేన, సృజన, శివ, శ్రీకాంత్, సురేష్ తాండ, ప్రదీప్ మెట్టు, హరి కిషోర్ గుంటూరు, పవన్ రెడ్డి నూకల, ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. టిటిఎ నిర్వహించే ప్రతి ఏటా బతుకమ్మ సంబురాలకు సియాటెల్ ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారిని వైవిధ్యభరితంగా అలంకరించే సియాటెల్ టిటిఎ ఈసారి అతి పెద్ద బతుకమ్మను తయారుచేశారు.

వంద తెలంగాణా తీన్మార్ డప్పులతో బతుకమ్మ అమ్మవారిని ఊరేగిస్తూ వేదిక, నార్త్ క్రీక్ మిడిల్ స్కూల్ లో, బోతెల్ సిటీ కి తీసుకు వచ్చారు. అనంతరం దుర్గ పూజ, కోలాటాలు, బతుకమ్మ ఆట పాటలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. షుమారు వెయ్యి మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) సియాటెల్ కార్యవర్గ సభ్యులై చక్కటి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలతో మమ్మల్ని మంత్ర ముగ్దులను చేస్తున్న టి టి ఏ బృందాన్ని సీటెల్ ప్రవాస భారతీయులు కొనియాడగా, ప్రతి సంవత్సరం ఈ రోజు కొరకు ఎంతో అతృతగా వేచి ఉంటామని తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.

గ్రేటర్ ఫిలడెల్ఫియా:- ఆలెన్ టౌన్ లో బతుకమ్మ సంబరాలు ..తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి వెంకన్నగారి మరియు బోర్డు అఫ్ డైరెక్టర్ కిరణ్ రెడ్డి గూడూరు ఆధ్వర్యంలో ఆలెన్ టౌన్ లోని శ్రీ వరదరాజులు స్వామి ఆలయంలో షుమారు మూడు వందల కుటుంబాలు పాల్గొని చక్కని వాతావరణంలో అమ్మవారి బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. గౌరి పూజతో అమ్మవారిని కొలిచి బంగారు బతుకమ్మలను పేర్చి కోలాటాలతో అమ్మవారి ఆట పాటలతో సందడిగా జరిగింది. వివిధ నైవేద్యాలతో అమ్మవారికి సమర్పించిన తీరు భక్తులను మంత్ర ముగ్ధులను చేసింది.

ఆదివారం పన్నెండు గంటలకు ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు చిరు జల్లుల నడుమ భక్తి పారవశ్యంలో తడిసి ముద్దయ్యారు. దగ్గరలో ప్రవహిస్తున్న సెలయేరులో అమ్మవారిని సాగనంపే కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఆలెన్ టౌన్ లో జరిగిన బతుకమ్మ సంబురాలు ఆధ్యంతం కన్నులపండుగల జరిగాయి. కిరణ్ రెడ్డి గూడూరు ఎంతో శ్రమించి నిర్వహిచిన ఈ బతుకమ్మ వేడుకలకు సురేష్ రెడ్డి వెంకన్నగారి, నరసింహ రెడ్డి దొంతిరెడ్డి, ప్రసాద్ కునారపు, అరుణ్ మేకల, కొండా లక్ష్మినరసింహ రెడ్డి, రమణ కొత్త హాజరయ్యారు.
అట్లాంటా/ఆల్బనీ:- తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) పాస్ట్ ప్రెసిడెంట్ భరత్ మదాడి సొంత నగరమైన అట్లాంటాలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట్ గడ్డం మరియు స్వాతి చెన్నూరి ఆధ్వర్యంలో జార్జియా లోని ఆల్బనీలో మెర్రి ఏసర్స్ ఇన్ అండ్ ఈవెంట్ సెంటర్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గౌరి పూజతో అమ్మవారిని కొలిచి బంగారు బతుకమ్మలను పేర్చి కోలాటాలతో అమ్మవారి ఆట పాటలతో సందడిగా జరిగింది.ఈ బతుకమ్మ వేడుకలకు బోర్డు ఆఫ్ డైరెక్టర్ కార్తిక్ నిమ్మల తదితరులు ఆహూతులకు కావాల్సిన భోజన ఏర్పాట్లు మరియు బతుకమ్మ ఆడుకోవటానికి చక్కటి వేదికను సమకూర్చారు.

బోస్టన్:- తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) బోస్టన్లో బతుకమ్మ సంబురాలు మిన్నంటేలా బోర్డు డైరెక్టర్ దివాకర్ జంధ్యం, శ్రీనివాస్ రెడ్డి మరియు శ్రీలక్ష్మి ఆకులేటి ఆధ్వర్యంలో న్యూ ఇంగ్లాడులోని శివ టెంపుల్ లో నిర్వహించింది. షుమారు వెయ్యి మంది మహిళలు అమ్మవారిని అలంకరించి తీసుకొచ్చారు. గౌరి పూజతో అమ్మవారిని కొలిచి బంగారు బతుకమ్మలను పేర్చి కోలాటాలతో అమ్మవారి ఆట పాటలతో సందడిగా జరిగింది. మహిళలకు బెస్ట్ బతుకమ్మ మరియు బెస్ట్ కాస్ట్యూమ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆహూతులందరికి చక్కని విందు భోజనం వడ్డించి ఆహుతుల మన్ననలను చూరగొన్నారు. ఆధ్యంతం భక్తి శ్రద్ధలతో బోస్టన్ బతుకమ్మను కొలిచారు. బతుకమ్మలను సాగనంపే కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు.

కాలిఫోర్నియా:- కాలిఫోర్నియా లోని బే ఏరియా లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) కార్యదర్శి శ్రీనివాస్ మానాప్రగడ, బోర్డ్ ఆఫ్ డైరక్టర్ నందా దేవి, RVP సరస్వతి మరియు రవి నేతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జానపద బతుకమ్మ సంబరాలు మౌంటెన్ హౌస్ హై స్కూల్ నందు ఆట పాటలతో అమ్మవారి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. గౌరి పూజతో అమ్మవారిని కొలిచి బంగారు బతుకమ్మలను పేర్చి కోలాటాలతో అమ్మవారి ఆట పాటలతో సందడిగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆధ్యంతం భక్తి శ్రద్ధలతో టిటిఎ కార్యవర్గం అమిత్ రెడ్డి అన్ని సమకూర్చారు. షుమారు అయిదు వందలమంది మహిళలు హాజరయిన ఈ కార్యక్రమానికి భోజన ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. టిటిఎ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడిన ఆహుతులు టిటిఎ సంఘంలో సభ్యత్వం తీసుకోవటానికి ముందుకు రావటం విశేషం.

లాస్ ఏంజెలెస్:- కాలిఫోర్నియా లోని లాస్ ఏంజెలెస్ లోని సహా కోశాధికారి హరిందర్ తాళ్లపల్లి ఆధ్వర్యంలో దసరా సంబురాలు సిమి వాలీ లోని ఓక్ పార్కులో ఘనంగా జరిగాయి. రుచికరమైన విందు భోజనం ఆహూతులకు వడ్ఢిచి దసరా దావత్ ఘనంగా చేసుకున్నారు.అనిల్ ఎర్రబెల్లి, సంతోష్ ఘంటారం మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.

హ్యూస్టన్:- తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) బోర్డు అఫ్ డైరెక్టరు దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో హూస్టన్ లోని ఇండియా హౌస్ లో షుమారు మూడు వేల మంది ఆహుతులతో టిటిఎ హూస్టన్ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. జానపద బతుకమ్మ ఆట పాటలతో అమ్మవారి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.గౌరి పూజతో అమ్మవారిని కొలిచి బంగారు బతుకమ్మలను పేర్చి కోలాటాలతో అమ్మవారి ఆట పాటలతో సందడిగా జరిగింది. టిటిఎ కార్యవర్గ సభ్యులు అరుణ్ తదితరులు హ్యూస్టన్ నుండి తరలి వచ్చిన మహిళా మణులకు చక్కటి భోజన ఏర్పాట్లు చేసి బతుకమ్మలు ఆడుకోవటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు.

You may like
-
TTA Charlotte Convention Off to a Grand Start with $1.1 Million Raised and Praveen Chintha at the Helm in Kickoff
-
Cultural Splendor at Its Best in Charlotte, North Carolina: TTA’s Bathukamma Event Draws Thousands in a Spectacular Celebration
-
TTA Atlanta Chapter Presents Grand Dasara 2025: A Celebration of Culture and Community