Connect with us

News

ఎమోషనల్ అయిన నరేన్ కొడాలి @ Team Kodali Success Party, Washington DC

Published

on

ఈ మధ్యనే ముగిసిన తానా ఎన్నికలలో డా. నరేన్ కొడాలి టీం విజయం సాధించిన విషయం అందరికి విదితమే. ఎన్నికల లో గెలిచిన అభ్యర్థులు అందరూ కలిసి నిన్న శనివారం, మార్చి 23న వాషింగ్టన్ డీసీ లో విజయోత్సవ సభ నిర్వహించారు. దాదాపు 600 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

డా. నరేన్ కొడాలి టీమ్ లో గెలిచిన వారు, శ్రేయోభిలాషులు వచ్చిన ఈ వేడుకలో నరేన్ కొడాలి విజేతలు అయిన అందరినీ స్టేజ్ మీదకు తనకు మద్దతు గా పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డా. నరేన్ కొడాలి తన ప్రసంగం లో గత రెండు సంవత్సరాలుగా తనను అధ్యక్ష పదవి కి చేరకుండా ప్రత్యర్థి వర్గం అనేక బాధలు పెట్టిందని అన్నారు.

అలాగే ప్రత్యర్థి వర్గం తనను కోర్టు చుట్టూ తిప్పిందని, వ్యక్తి గత దూషణలు, ఆరోపణలు చేసిందని, కేవలం తానా సంస్థ మీద అభిమానంతో తాను, తన కుటుంబం నిలబడిందని ఎమోషనల్ అయ్యారు. ఇంకా ఇబ్బందులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. తానా ప్రతిష్ట ను మరింత పెంచేలా తెలుగు కమ్యూనిటీ కి సేవ చేస్తామని తెలిపారు.

ఈ వేడుకకు శ్రీనివాస్ లావు, రవి పొట్లూరి, రాజా కసుకుర్తి, వెంకట్ కోగంటి, సునీల్ పంత్ర, లోకేష్ కొణిదెల, నాగా పంచుమర్తి, టాగోర్ మలినేని, సతీష్ కొమ్మన, ఎందురి శ్రీనివాస్, రామ్ అల్లు , వెంకట్ అడుసుమిల్లి, కె పి సొంపల్లీ, నీలిమ మన్నే, సతీష్ చింత, వెంకట్ సింగు, సురేష్ పాటిబండ్ల మరి కొందరు విజేతలు వచ్చారు.

వీరితోపాటు తానా పెద్దలు జయరామ్ కోమటి, సతీష్ వేమన, శ్రీనివాస్ గోగినేని, ప్రసాద్ నల్లూరి తదితరులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అనిల్ ఉప్పలపాటి, సాయి బొల్లినేని, సతీష్ చింత, జనార్దన్ నిమ్మలపూడి, త్రిలోక్ కంతేటి, సుధీర్ కొమ్మి, రాజేష్ కాసరనేని మరియు వర్జీనియా నరేన్ కొడాలి మిత్ర బృందం సమన్వయ పరిచారు.

error: NRI2NRI.COM copyright content is protected