Connect with us

News

యూరప్ లో తెలుగుదేశం పార్టీ మహానాడు సన్నాహక సమావేశం

Published

on

తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి మే 28న ఓ పండుగలా నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడు యూరోప్ లోని వివిధ నగరాల్లో కార్యక్రమాన్ని నిర్వహించదలచిన సందర్భంగా కార్యనిర్వాహక సభ్యులందరూ కలిసి బర్మింగ్ హామ్ నగరంలో ఏప్రిల్ 24న సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశం మొదలయ్యే ముందు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కింజరపు అచ్చన్నాయుడు గారు, ఎన్నారై టిడిపి సెల్ పొలిటికల్ ఇంఛార్జి శ్రీ బుచ్చి రాంప్రసాద్ గారు, పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్థన్ గారు, తెలుగు మహిళ అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు జూమ్ కాల్ లో హజరై, యూరప్ లో ఎవరైతే  తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతిపరులు, కార్యకర్తలు ఉన్నారో వారందరిని వ్యక్తిగతంగా కలుసుకొని ఈ మహనాడు పాలుపంచుకొనేలా చేయాలని, పార్టీ అధిష్టానం నుంచి అవసరమైన అన్ని రకాల సహయ, సహకారాలు నిరంతరం అందుబాటులో ఉంటామని తెలియజేశారు.

యూరప్ లో జరిగే వేడుకకు రావాలని ఉన్నా, రాష్ట్రంలో జరిగే మహానాడు వేడుకలా జరగబోతున్న సందర్భంలో రాలేకపోతున్నామని తెలియజేశారు. ఇది మనందరిది భాధ్యత, ఇప్పటివరకు ఒక లెక్క, ఈ 40వ సంవత్సరాల మహానాడు ఒక లెక్క, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, తెలుగు ప్రజలైన మనందరిపై ఆధారపడినందు వలన, అందరూ చిత్తశుద్ధితో, అంకితభావంతో ఎవరి స్థాయిలో వారు, తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమ నిర్వాహకులందరూ శ్రీ అచ్చన్నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపి, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామని తెలియజేశారు. ఈ కార్యనిర్వాహక సమావేశానికి యూకే నుంచి జయకుమార్ గుంటుపల్లి, వేణు మాధవ్ పోపూరి, శ్రీకిరణ్ పరుచూరి, నరేష్ మల్లినేని, ప్రసన్న నాదెండ్ల, శ్రీనివాస్ పాలడుగు, చక్రీ మువ్వ, సురేష్ అట్లూరి, నారాయణ రెడ్డి, శ్రీకాంత్ యర్రం, నాగరాజు బండ్ల, వీర పరిటాల, శ్రీధర్ నారా, కిరణ్ అరవపల్లి మరియు యూకే  విద్యార్థి నాయకులు భానూజీ కుక్కల, లింగా రవితేజ, హర్ష చప్పిడి, రవి నల్లమోతు, ఐర్లాండ్ నుంచి మురళీ రాపర్ల, జర్మనీ నుంచి టిట్టు, శివ, పోలెండ్ నుంచి చందు, బెల్జియం నుంచి దినేష్, ఫ్రాన్స్ నుంచి మహేష్ తదితరులు హాజరయ్యారు. హాజరు కాలేని మిగతా సభ్యులు తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected