Connect with us

Celebrations

అమెరికాలోని Los Angeles లో TDP, JSP, BJP విజయభేరి, 100 కార్లతో ర్యాలీ

Published

on

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎన్నికలు ప్రజాకంఠక పాలనకు అంతం పలికి టీడీపీ-జనసేన-బీజేపీ (TDP, JSP, BJP) కూటమి ఘనవిజయాన్ని అందుకున్న సందర్బంగా ప్రపంచం నలుమూలల తెలుగు (Telugu) వారి సంబరాలు అంబరాన్ని అంటాయి.

ఈ విజయాన్ని పురస్కరించుకొని కాలిఫోర్నియా (California) రాష్ట్రము లాస్ ఏంజెలెస్ (Los Angeles) సిటీ, సిమి వాలీ లో నగర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు (TDP) కిషోర్ గరికపాటి, జనసేన పార్టీ NRI Coordinator వెంకట్ అరసాలా మరియు BJP నాయకులు వాసు రెడ్డి వావిలాల గారి ఆధ్వర్యంలో ఉత్సవంగా విజయోత్సవభేరి సంబరాలను నిర్వహించారు.

ఈ సందర్బంగా Los Angeles లో 100 కార్లతో ర్యాలీ నిర్వహించి టీడీపీ-జనసేన-బీజేపీ (TDP, JSP, BJP) సంబరాలు కనులవిందుగా చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలనపై పోరాటం చేసిన కార్యకర్తలని, అమరావతి రైతులని గుర్తుచేసుకుంటూ అభిమానం చాటుకున్నారు.

ఈ సందర్బంగా నందన్ పొట్లూరి గారు, రంగారావు నన్నపనేని గారు, ప్రతాప్ మేడరామిట్ట గారు, హేమ కుమార్ గొట్టి గారు మరియు పలువురు NRI లు ఎన్నికల ప్రచారం లో పాలుపంచుకొని కూటమి (National Democratic Alliance – NDA) విజయానికి దోహద పడ్డ విషయాలను నెమరువేసుకున్నారు.

ఈ సందర్బంగా పలువురు ముక్యులు అమెరికా నుంచి వెళ్లి మాతృభూమి కొరకు ప్రజా సేవ కోసం రాజకీయాల్లో చేరి విజయం సాదించిన పెమ్మసాని చంద్రశేఖర్ (Dr. Chandra Sekhar Pemmasani) గారిని, వెనిగండ్ల రాము గారిని, సురేష్ కాకర్ల గారిని మరియు రోషన్ కుమార్ సొంగ గారిని అబినందనీయ భావంతో గుర్తు చేసుకొని కొనియాడారు.

సభను చక్కగా నిర్వహించిన వారిలో తెలుగు దేశం పార్టీ (TDP) కార్యకర్తలు కిశోరె గరికపాటి, సురేష్ అంబటి, హేమ కుమార్ గొట్టి, వెంకట్ గంటా, శ్రీహరి కొంక, రాజేంద్ర చింతమనేని, సుదీర్ కోనేరు, మధు బోడపాటి, గురు కొంక, నరేంద్ర పిన్నమనేని, చందు గుత్తికొండ, వేణు జెట్టి, జనసేన పార్టీ NRI Coordinator వెంకట్ అరసాలా మరియు జనసేన పార్టీ (JSP) కార్యకర్తలు అరుణ్ గిడ్డ, కార్తీక్ చిక్కాల, KVR సిద్దార్థ్ లు ఉన్నారు.

సభకు ముఖ్య అతిధులు గా విచ్చేసిన శరత్ కామినేని గారు, రవి ఆలపాటి గారు, విజయ్ భాస్కర్ గారు, శ్రీహరి అట్లూరి గారు, శ్రీధర్ సాతులూరి గారు, రాజు కాకర్లపూడి గారు, మురళి రెడ్డి గారు, చందు పల్లబోయిన గారు, ప్రతాప్ గద్దె గారు తదితరులు నిర్వాహకులను కొనియాడారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected