Connect with us

News

ఉప్పొంగిన టీడీపీ & జనసేన నారీ శక్తి విజయోత్సవ సంబరాలు @ Atlanta, Georgia

Published

on

ఇటీవల జరిగిన ఎన్నికలలో దిక్కులు పిక్కటిల్లే విజయాన్ని అందించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తీర్పుతో, అట్లాంటా తెలుగుదేశం (Telugu Desam Party) ఆడపడుచులు మరియు జనసేన (Jana Sena Party) వీర మహిళల సంబరాలు జూన్ 4 సాయంత్రం అంబరాన్ని అంటేలా చేసుకున్నారు.

భారత దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఏ విషయాన్ని అయినా సునిశితంగా పరిశీలిస్తూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమ వంతు సహాయం చేయటానికి ముందుండే ప్రవాసాంధ్రులలో ముఖ్యులు అట్లాంటా (Atlanta) తెలుగు ప్రజలు. ఈ ఎలక్షన్స్ లో కూడా ముఖ్య భూమిక పోషించారు.

దాని ఫలితంగా లభించిన విజయాన్ని ఆస్వాదించటానికి “నారీ శక్తి” కదిలింది. అట్లాంటా (Atlanta) లో ఏ కార్యక్రమం జరిగినా ముందుండి ప్రోత్సహించే సంక్రాంతి రెస్టారంట్ (Sankranthi Restaurant) యాజమాన్యం కవిత కాట్రగడ్డ మరియు శ్రీనివాస్ నిమ్మగడ్డ ఈ ఈవెంట్ కి సకల సదుపాయాలు అందించారు.

అప్పటికప్పుడు అనుకున్నదే అయినా మహిళలందరూ ఒక తాటి మీదకు వచ్చి, వారి ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. కార్యక్రమ నిర్వహణ భాద్యత తీసుకున్న సుజాత ఆలోకం, నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) ప్రతిమ ముందు విజయ దీపారాధన చేయటానికి ముందుగా పెద్దల్ని ఆహ్వానించారు.

ఐదు సంవత్సరాలుగా గూడు కట్టిన బాధ, అవమానం, నిర్వీర్యమైపోతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని నిశ్చేష్ఠులై చూసిన తరువాత వచ్చిన విజయం తాలూకా ఆనందం ప్రతి ఒక్కరి మోములో తొణికిసలాడింది. అందులోనూ 175 కి 164 సీట్లు రావడంతో అందరి ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

ఎట్టకేలకు రాష్ట్రం మళ్ళీ భావితరాల అభ్యున్నతికి బాటలు వేస్తూ, ప్రజాహితమైన సంక్షేమాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకు పోయే నైపుణ్యం, పరిపాలనా దక్షత ఉన్న నాయకుడి (Nara Chandrababu Naidu) చేతుల్లోకి మళ్ళీ రావటంతో ఊపిరి పీల్చుకుంటూ ఆనందం తో పుంతలు తొక్కిన తీరు పండుగ వాతావరణాన్ని మించి కనిపించింది.

ఈ సందర్బంగా అట్లాంటా (Atlanta, Georgia) వాసి అయిన రాము వెనిగండ్ల (Ramu Venigandla) విజయం (గుడివాడ MLA) గురించి, వారితో తమకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. అంతేకాక పలువురు వారి వారి స్వానుభవాలని అందరితో పంచుకున్నారు.

తెలుగుదేశం పార్టీ MLC పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) వీడియో కాల్ లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాలలో ప్రవాసాంధ్రుల పాత్రను కొనియాడారు. తరువాత రాష్ట్రాభివృద్ధికి వారి ముందున్న ప్రణాళిక గురించి కొద్ది సేపు వివరించారు.

చివరిగా చివరిగా టీడీపీ, జనసేన, బీజేపీ (National Democratic Alliance – NDA) కేకులు కోసి ఒకరికొకరు పంచుకుని, ఆనంద నృత్యాలతో ప్రాంగణాన్ని దద్దరిల్లింప చేశారు. ఇటువంటి నారీ శక్తి ని ప్రదర్శించే కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected