Connect with us

News

గుడివాడ బరిలో ఉన్న రాము వెనిగండ్ల కి పెద్ద ఎత్తున మద్దతు @ Atlanta

Published

on

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ (Gudivada) శాసనసభకు పోటీ చేయనున్న అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటా నగర వాసి రాము వెనిగండ్ల కి అనూహ్య మద్దతు దక్కింది. తెలుగుదేశం, జనసేన ఇలా అట్లాంటా (Atlanta) ప్రవాసులు అందరూ ఏకమై సమైక్యంగా సంపూర్ణ మద్దతు తెలిపారు.

‘అట్లాంటా ఫర్ రాము వెనిగండ్ల’ అని శుక్రవారం అక్టోబర్ 13న స్థానిక సంక్రాంతి రెస్టారెంట్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో తెలుగుదేశం (Telugu Desam Party) మరియు జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఏకాభిప్రాయ మద్దతు తెలియజేశారు. అందరికీ ఆప్తులైన రాము వెనిగండ్ల ని అక్కున చేర్చుకున్నారు.

అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ లో చురుకుగా ఉండే సంక్రాంతి రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్ నిమ్మగడ్డ (Srinivas Nimmagadda) ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికా రాజకీయ నాయకులకు రిపబ్లికన్ నేషనల్ కమిటీ (Republican National Committee) నిర్వహించే తరహాలో అనుభవం మేరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

రాము వెనిగండ్ల మాట్లాడుతూ.. వెనిగండ్ల ఫౌండేషన్ (Venigandla Foundation) ద్వారా గుడివాడ లో ఇప్పటికే ఉచిత మెగా ఆరోగ్య శిబిరాలు, అన్న క్యాంటీన్ల ద్వారా అన్నదానం, ఉద్యోగ మేళాలు, రైతు భరోసా, ఆపదలో ఉన్నవారికి ఆర్ధిక సహాయం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

గుడివాడ మరో కొడాలి నాని ని కోరుకోవడం లేదంటూ పలు ప్రజోపయోగ కార్యక్రమాలతో గుడివాడ అడ్డాలో తెలుగుదేశం పార్టీ జెండాను తిరిగి రెపరెపలాడించడానికి రాము (Ramu Venigandla) మదిలోని ఆలోచనలను, అలాగే ఆ ఆలోచనలను అమలుపరిచే విధివిధానాలను కూలంకుషంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో అట్లాంటా తెలుగుదేశం పార్టీ నేతలు అంజయ్య చౌదరి లావు, సతీష్ ముసునూరి, మల్లిక్ మేదరమెట్ల, శ్రీనివాస్ లావు మరియు శ్రీనివాస్ నిమ్మగడ్డ ప్రసంగించారు. అలాగే అట్లాంటా జనసేన పార్టీ నేతలు సురేష్ ధూళిపూడి, ఇన్నయ్య ఎనుముల, వెంకట్ మీసాల ప్రసంగిస్తూ వ్యక్తిగతంగా మరియు పార్టీ పరంగా రాము కి మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు వారి అభిప్రాయాలను, సూచలను, సలహాలను రాము వెనిగండ్లతో పంచుకోవటం జరిగింది. అలాగే పలువురు అడిగిన ప్రశ్నలకు రాము తనదైన సమాధానాలు ఇచ్చారు. ఆహ్వానితులందరూ రాము వెనిగండ్ల (Ramu Venigandla) తో ఫోటోలు దిగారు.

ఈ సందర్భంగా వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా గుడివాడ నియోజకవర్గంలో రాము చేస్తున్న సేవాకార్యక్రమాల వీడియోలు ప్రదర్శించారు. అగ్ర రాజ్యం అమెరికాలో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, తను పుట్టి పెరిగిన గుడివాడని అభివృద్ది పథంలో నడపాలని కుల మత ప్రాంతాలకతీతంగా అన్ని వర్గాల వారికి రాము చేస్తున్న ప్రయత్నాలను సభికులు అభినందించారు.

తెలుగుదేశం, జనసేన (Janasena) నేతలు తమ పార్టీల జండాలు, కండువాలతో మూకుమ్మడిగా పెద్ద ఎత్తున మద్దతు తెలపడమే కాకుండా, గుడివాడ నియోజకవర్గంలోని తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను సమన్వయపరిచి రాము వెనిగండ్ల విజయయానికి దోహదపడతామనడం అభినందనీయం.

అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) ని చట్టవిరుద్ధంగా, అక్రమంగా అరెస్టు చేయడాన్ని అందరూ ముక్తఖంఠంతో ఖండించారు. ఉయ్ ఆర్ విత్ సీబీఎన్, సేవ్ డెమోక్రసీ సేవ్ ఏపీ, ఉయ్ డిమాండ్ జస్టిస్, సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు.

సుమారు 500 మంది పాల్గొన్న ఈ అట్లాంటా ఫర్ రాము వెనిగండ్ల (Atlanta for Ramu Venigandla) కార్యక్రమానికి మహిళలు సైతం హాజరవ్వడం విశేషం. అనీల్ యలమంచిలి, భరత్ మద్దినేని, మురళి బొడ్డు, మధుకర్ యార్లగడ్డ మరియు వినయ్ మద్దినేని తదితరులు ఈ ఈవెంట్ ని విజయవంతం చేయడంలో సహాయసహకారం అందించారు.

ఈ కార్యక్రమానికి ఫొటోగ్రఫీ & వీడియో సేవలను వాకిటి క్రియేషన్స్ (Vakiti Creations) నుంచి శ్రీధర్ రెడ్డి వాకిటి & ప్రవీణ్ బొప్పన, ఆడియో & మ్యూజిక్ సేవలను AR Dazzle Events నుంచి రజనీకాంత్, మీడియా సేవలను టీవీ9 (TV9) నుంచి శివ రామడుగు అందించారు.

భోజనానంతరం వందన సమర్పణలో భాగంగా ఎన్నారై టీడీపీ అట్లాంటా (NRI TDP Atlanta) నాయకులకు, కార్యకర్తలకు, అట్లాంటా జనసేన (Atlanta Janasena) నాయకులకు, కార్యకర్తలకు, అలాగే రాము వెనిగండ్ల కోసం కార్యక్రమం ఆసాంతం పాల్గొని విజయవంతం చేసిన ఆహ్వానితులకు కృతజ్ఞతలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected