Connect with us

News

విజయవాడ తాడిగడపలోని మురళీనగర్లో తెలుగుదేశం పార్టీ 40వ వార్షికోత్సవ వేడుకలు

Published

on

తెలుగుదేశంపార్టీ 40వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ, తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని మురళీనగర్ నందు గుంటుపల్లి శ్రీనివాసరావు నిర్వహణలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెనమలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోడె ప్రసాద్ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం తేలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యపడుతుంది అని అన్నారు.

వైయస్ఆర్ ప్రభుత్వం గడచిన కాలంలో దళితుల సంక్షేమం విస్మరించిన కారణంగా, దళిత సామాజిక వర్గానికి చెందిన సారధి సైన్యం సభ్యులు, వైసీపీ నాయకులు కోడూరు అంజి అతని మిత్రబృందం తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంటరి మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వెలగపూడి శంకర్ బాబు, దోనెపూడి కిరణ్, కాట్రగడ్డ లీలా ప్రసాద్, శోభన్, రాజా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు గుంటుపల్లి శ్రీనివాసరావు గారు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected