తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో మార్చి 12న వనిత డే నిర్వహించారు. మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా స్వప్న కస్వా అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకలకు సుమారు 600 మంది మహిళామణులు పాల్గొన్నారు. ఆటపాటలు, స్ఫూర్తిదాయక ప్రసంగాలు, అందాల అతివల ఫ్యాషన్ షో, గల గల మాటలు, అలరించే పాటలు, పలు రకాల షాపింగ్ స్టాల్ల్స్, పసందైన భోజనంతో అందరినీ ఆకట్టుకున్న ఈ వేడుకలు సకల అనుభూతుల సమాహారంగా సాగింది.
సాంప్రదాయబద్దంగా జ్యోతి ప్రజ్వలనతో ఆరంభిస్తూ అందరికీ శుభాభినందనలు తెలియపరచిన స్వప్న కస్వా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం స్త్రీ సశక్తీకరణ అని పేర్కొనడం సభాసదులలో ఉత్సాహాన్ని నింపింది. అట్లాంటా తెలుగు వారికి సుపరిచితురాలు లావణ్య గూడూరు ఉల్లాసభరిత యాంకరింగ్ తో కార్యక్రమానికి మరింత సందడి తోడయింది.
వివిధ రంగాల్లోని మహిళా ప్రముఖులు విశిష్ఠ అతిథులు కావడం కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చింది. ప్రీతి మునగపాటి, డా।। నందిని సుంకిరెడ్డి, డా।। నీలిమ దాచూరి లను సత్కరించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పలు సంస్థల మహిళా కార్యవర్గ సభ్యులను సగౌరవంగా అభినందించారు.
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ అమెరికా ఉపాధ్యక్షులు బాపు రెడ్డి కేతిరెడ్డి మరియు సంయుక్త కార్యదర్శి స్వాతి సుదిని టీడీఫ్ కు నిరంతర సహకారాన్ని అందిస్తున్న కార్యవర్గ మహిళలను, స్పాన్సర్స్ ను, మరియు స్వచ్ఛంద సేవకులను పేరు పేరునా వేదిక పైకి ఆహ్వానించి అభినించడం విశేషం.
సిక్స్ స్ట్రింగ్స్ వారి పాటలు అందరినీ చిందులేయించగా, అనూష వంగర బృందం ఫ్యాషన్ షో తో అందరి దృష్టిని ఆకర్షించింది. శ్రీనివాస్ దుర్గం ఆడియో సహాయం బాగుంది. ఇంకా తమ సహాయ సహకారాలను అందించిన మహేష్ కొప్పు, సాయిరాం కారుమంచి, కిరణ్ తాటిపల్లి, బాల మద్ద, నిరంజన్ పొద్దుటూరి తదితరులకు, అలాగే స్కూల్ విద్యార్థులు సాకేత్ పొద్దుటూరి, శ్రేయన్ష్ కస్వా తదితరులకు అభినందనలు తెలియచేసారు.
కార్యక్రమ రూపకల్పన మరియు నిర్వహణలో ఆద్యంతం బాధ్యత వహించిన లలిత, అపర్ణ పింగ్లే, మాధవి దాస్యం, స్వాతి సుదిని, వాసవి, లక్ష్మి లకు సంస్థ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు. టీడీఫ్ అట్లాంటా 2022 ప్రెసిడెంట్ గా స్వప్న చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం విజయవంతమవడం అభినందనీయం.
మరిన్ని ఫోటోల కొరకు సంధ్య ఫోటోగ్రఫీ వెబ్సైటుని ఈ లింక్ ద్వారా సందర్శించండి.