తింటే గారెలు తినాలి… మరి వింటే గీతామాధురి పాటలు వినాలా లేక మంగ్లి జానపదాలు వినాలా లేక శివా రెడ్డి నవ్వుల సందడి చూడాలా? ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే మనం తప్పకుండా దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం వారు నిర్వహిస్తున్న ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలకు వెళ్ళవలసిందే. అదేనండి వచ్చే నెల ఏప్రిల్ 14 శనివారం సాయంత్రం 5:30 గంటల నుండి స్థానిక వాలి ఉన్నత పాఠశాలలో అంగరంగ వైభవంగా ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు తెలుగు సినీ నటి లయ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. గీతామాధురి , మల్లిక్, గోపికల ఉర్రుతలూగించే పాటలు, శివా రెడ్డి కామెడీ, తీన్మార్ మంగ్లి జానపద గీతాలు, సంప్రదాయ కోలాటం, ఉగాది కవితలు, రాఫుల్ బహుమతులు, ప్రపంచ డోలు నృత్యం మరియు స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలు లాంటి ప్రత్యేకతలు ఎన్నో మరెన్నో. మరి ఇంకెందుకు ఆలస్యం టికెట్స్ కొరకు http://www.mana-tasc.org/ సందర్శించండి.