అమెరికాలో సాహిత్య, సంగీత, సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసి, ఆధునికతను మేళవించి తెలుగు మనసులను రంజింపచేస్తున్న టాంటెక్స్ సంస్థ అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి, పాలక మండల అధిపతి వెంకట్ ములుకుట్ల గారి అధ్యక్షతన డాలస్ లో మే 15వ తేదీన ప్లానో ఈవెంట్ సెంటర్లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి.
భరత మాత ప్రార్థనా గీతంతో ప్రారంభమైన కార్యక్రమాలు సంస్కృతి సంప్రదాయాల మేళవింపుగా ఆసక్తి కరంగా సాగాయి. శాస్త్రీయ నృత్యం చూస్తే టాంటెక్స్ వేడుకలలోనే చూడాలి అనేలా కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు. స్థానిక నృత్య పాఠశాలలు రామ నవమి, ఉగాది పండుగలు నృత్య రుపంలొ ప్రదర్సించిన విధానము పలువురిని ఆకట్టుకున్నాయి. సినిమా పాటలకు పిల్లలు, పెద్దలు చేసిన నృత్యాలు హుషారు తెచ్చాయి.
కార్యక్రమంలో భాగంగా సంగీత దర్శకుడు మణి శర్మ గారి సంగీత బ్రుందం రేవంత్, రాహుల్ సిప్లిగంజ్, సూర్య పవన్, లిప్సిక, అంజనా సౌమ్య, అఖిల ప్రేక్షకులని మరింత ఉత్తేజ పరిచారు. గాయని, గాయకులు సంగీత విభావరితో హై వోల్టేజ్ మరియు ఎనర్జిటిక్ నాన్ స్టాప్ పాటలతో కచేరీ నాన్ స్టాప్ గా 3 గంటల పాటు సాగింది. విచ్చేసిన గాయని గాయకుల ను అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి గారు మరియు కార్యవర్గ సభ్యులు పుష్పగుచ్చము, జ్ఞాపిక మరియు శాలువాతో సత్కరించారు.
కచేరీ విరామ సమయంలో అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి గారు అందరికి తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 1986 లో ప్రారంభమైన టాంటెక్స్ సంస్ధ, సంవత్సరం పొడుగున వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఏకైక సంస్థ మన టాంటెక్స్ అని సగర్వంగా తెలియజేశారు.
2022 సంవత్సరపు పోషక దాతలనందరిని అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి గారు మరియు మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రకటించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఉగాది సందర్భముగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రతిభావంతులని టాంటెక్స్ బ్రుందం పుష్ప గుచ్చము మరియు జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు.
శ్రీమతి హేమమాలిని చావలి – కళలు & నృత్యం డా. సత్యం ఉపద్రష్ట – సాహిత్యం శింధు వెముల, సాహితి వెముల, హరీష్ కుమార్ వెన్నపూస – ఉత్తమ స్వచ్ఛంద సేవకులు శ్రీజ కుప్పం, సంజయ్ వట్టంరెడ్డి – అత్యుత్తమ విద్యా నైపుణ్యం మరియు సమాజ సేవ గోపాల్ పోనంగి – సమాజ సేవ డా. పవన్ పామదుర్తి – వైద్య
ఉగాది ఉత్సవాల సమన్వయకర్త సతీష్ బండారు గారు, నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథులకు విందు భోజనం వడ్డించిన ఫూడిస్థాన్ యాజమాన్యంకు, మరియు ఎలాంటి లాభాపేక్షా లేకుండా తెరవెనుక నుండి సేవలందించిన కార్యకర్తలందరికి టాంటెక్స్ తరపున కృతఙ్ఞతలు తెలియజేశారు.
ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సాక్షి, ఐఏసియా టీవీ, రేడియో కారవాన్ ,ఈనాడు, ఆంధ్ర జ్యోతి, తెలుగు టైమ్స్, NRI2NRI, TNI Live లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియ చేయటంతో శోభాయమానంగా నిర్వహించిన ఉగాది ఉత్సవాలకి తెరపడింది.