భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు ఒకసారి ప్రామిస్ చేసి మాట తప్పితే యు ఆర్ నాట్ కాల్డ్ ఎ మాన్, ఎప్పటికీ మాట తప్పను అని చెప్పిన పవర్ఫుల్ డైలాగుని తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ నిజం చేస్తున్నట్లుంది. గత తానా ఎన్నికలలో నెక్స్ట్ జనరేషన్ యువతని తానా కార్యక్రమాలలో పాల్గొనేలా చేస్తానని ప్రామిస్ చేసి గెలిచిన సంగతి తెలిసిందే.
మహేష్ బాబు లా తన మాటను నిలబెట్టుకునే క్రమంలో ముందడుగు వేసినట్టేనని అంటున్నారు తానా సభ్యులు. ఎందుకంటే తానా చరిత్రలో మొట్టమొదటిసారిగా త్రీ ఆన్ త్రీ బాస్కెట్ బాల్ టోర్నమెంట్స్ నిర్వహిస్తూ నెక్స్ట్ జనరేషన్ యువతని తానాలో భాగస్వామ్యం చెయ్యడంవల్ల. దీనికి ముందు చెస్ పోటీలు కూడా నిర్వహించారు. బీ ఎ రోమన్ ఇన్ రోమ్ అన్నట్లు అమెరికాలో నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ఎక్కువగా ఆడే బాస్కెట్ బాల్ ఆటని తీసుకొని అందునా త్రీ ఆన్ త్రీ అంటూ క్రొత్త ఫార్మాట్ తో శశాంక్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఈ సృజనాత్మక ఆలోచనతో వచ్చిన శశాంక్ ని, ఆ ఆలోచనకి సపోర్ట్ చేసిన తానాని ముఖ్యంగా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ని అభినందించాలి. అంజయ్య చౌదరి ప్రెసిడెంట్షిప్ లో మొట్టమొదటి ఫేస్ టు ఫేస్ ఈవెంట్ ఈ టోర్నమెంట్ అవ్వడం విశేషం.
అమెరికా అంతటా నెక్స్ట్ జనరేషన్ టోర్నమెంట్స్ నిర్వహించే ఆలోచనతో ముందుగా అపలాచియాన్ ప్రాంతం నార్త్ కరోలినా లోని ర్యాలీ నగరంలో గత జులై 30న విజయవంతంగా నిర్వహించారు. ఇందులో సుమారు యాభై మంది హైస్కూల్ యువత పాల్గొన్నారు. గెలిచినవారికి ట్రోఫీలు, క్యాష్ ప్రైజులు అలాగే పాల్గొన్న అందరికి కన్సోలేషన్ ప్రైజులు అందజేశారు. మొట్టమొదటి టోర్నమెంట్ కి సహకరించిన తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, అపలాచియాన్ ప్రాంత లీడర్షిప్ పురుషోత్తమ చౌదరి గుదె, సురేష్ కాకర్ల, శ్రీనివాస్ చందు గొర్రెపాటి, నాగమల్లేశ్వర పంచుమర్తి, శ్రీధర్ గోరంటి అలాగే రాజేష్ యార్లగడ్డ, సంహిత్ కాకర్ల తదితరులకు శశాంక్ ధన్యవాదాలు తెలియజేసారు.