మిచిగన్ లోని డెట్రాయిట్ నగరంలో ఏప్రిల్ 29న తానా క్యూరీ లెర్నింగ్ సెంటర్ గణితం, సైన్స్ మరియు స్పెల్లింగ్ బీ విభాగాలలో పోటీలు నిర్వహించారు. తరగతుల వారీగా నిర్వహించిన ఈ పోటీలకు పద్మభూషణ్ ఆచార్య లక్ష్మీ ప్రసాద్ యార్లగడ్డ ముఖ్య అతిధిగా పాల్గొనడం విశేషం. తానా మిచిగన్ ప్రాంత నాయకులు సునీల్ పాంత్రా, కిరణ్ దుగ్గిరాల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, రవి దొప్పలపూడి, వేణు చిలుకూరి తదితరులు పోటీల నిర్వహణలో ముందుండి నడిపించారు. సుమారు 60 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలలో విజేతలకు ట్రోఫీలు తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు అందజేశారు. పెద్దలకే కాకుండా ఇలా పిల్లలకి కూడా ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తున్న తానా కార్యవర్గాన్ని అందరూ అభినందించడం విశేషం.