కాలిఫోర్నియాలో మొట్టమొదటిసారిగా టేబుల్ టెన్నిస్ క్రీఢా పోటీలను తానా లాస్ ఏంజెలెస్ నాయకత్వంలో ఏప్రిల్ 21 న విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ క్రీఢా పోటీలలో సుమారుగ 100 మంది క్రీడాకారులు, పురుషులు, మహిళలు మరియు పిల్లల విభాగాలలో పోటీపడటం జరిగింది. తానా అధ్యక్షులు సతీష్ వేమన ముఖ్య అతిధిగా ఈ టేబుల్ టెన్నిస్ పోటీలను ప్రారంభించారు.
లాస్ ఏంజెలెస్ లోని వివిధ తెలుగు సంఘాల వారు ఈ పోటీలలో పాల్గొనడం విశేషం. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఈ పోటీలను రాబోయే అక్టోబర్లో నిర్వహించే బాక్ టు స్కూల్, బ్యాక్ ప్యాక్ కార్యక్రమాలకు నిధులను సమకూర్చుకునేందుకు నిర్వహించడం జరిగింది. ఈ ఆటల పోటీలలో పాల్గొనడం ద్వారా ప్రతి ఒక్కరు రాబోయో విద్యా సంవత్సరములో నిరుపేద విద్యార్థులకు కావాల్సిన బ్యాక్ ప్యాక్స్, పుస్తకములు, పెన్స్ మరియు పెన్సిల్స్ ఉచితముగా ఇవ్వడంలో భాగస్వాములు అయ్యారు.
ఈ పోటీలను విజయ వంతంగా నిర్వహించడంలో తానా లాస్ ఏంజెలెస్ నగర సమన్వయకర్త సురేష్ కందేపు, ముఖ్య కార్యకర్తలు చంద్ర శేఖర్ పల్లెబోయిన, శ్రీకాంత్ మోపర్తి, వినోద్ బూరుగుపల్లి, శ్రీనివాస్ పోపూరి, రవీంద్ర జంగాల కీలక పాత్ర పోషించారు. హర్ష ఆత్మకూరు, శ్రీహరి కొమ్మలపాటి, అమర్ కేతిరెడ్డి లు ఆటల పోటీలను నిర్వహించడం లో ఇతోధిక సహాయాన్ని అందించారు. దోశ ప్లేస్ టస్టిన్ వారు మధ్యాహ్న భోజనము, సాయంత్రం టీ, ఫలహారాలను అందించడం జరిగింది.
పోటీల ముగింపులో సురేష్ కందేపు ఈ ఆటల పోటీల విజయానికి కారకులైన స్నేహితులు, తానా కార్యకర్తలు, అంపైర్లుగా వ్యవహరించిన సతీష్ నండూరి, సెంథిల్ కుమార్, మురళి పోట్ల, రామ్ యార్లగడ్డ, శశాంక్ రెడ్డి, మీర్, సృజన్ యాపర్తి మరియు దోశ ప్లేస్ వారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేసారు.