నాలుగు నెలల భీకర పోరుతో ఇటు అమెరికాలో అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠరేపిన తానా ఎన్నికలలో నిరంజన్ టీం భారీ విజయంతో వార్ వన్ సైడ్ అయ్యిన విషయం తెలిసిందే. అట్లాంటాలో లావు బ్రదర్స్ ఆధిపత్యం కారణంగా అమెరికా మొత్తం నంబర్ గేమ్ లో వెనకబడ్డామని నరేన్ వర్గం ఎలక్షన్ కి ముందే ఒప్పుకున్నప్పటికీ, ఎలాగోలా ఒక్క నరేన్ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ గెలుస్తాం అనే దగ్గిరనుంచి అందరిలోకెల్లా నరేన్ కే తక్కువ ఓట్లు రావడం వరకు, అలాగే నిరంజన్ వర్గం కొన్ని పోజిషన్స్ డౌట్ అనే దగ్గిరనుంచి దాదాపు 10% ఓట్ల పైన తేడాతో ఫుల్ ప్యానెల్ స్వీప్ చెయ్యడం వరకు పూర్తి విశ్లేషణ ఎన్నారై2ఎన్నారై.కామ్ మీకోసం అందిస్తుంది.
ముందుగా అట్లాంటా లావు బ్రదర్స్ గురించి చెప్పుకోవాలి. తానా బోర్డు సభ్యుడు, మంచి వ్యూహకర్త, రాజకీయ చతురత ఉన్న లావు శ్రీనివాస్, అలాగే కాబోయే తానా ప్రెసిడెంట్, అజాతశత్రువు, అమెరికా అంతటా అందరి తలలో నాలుకలా కలిసిపోయే లావు అంజయ్య చౌదరి ఈ ఎలక్షన్స్ లో గెలిచే వారందరూ రాబోయే 2 సంవత్సరాలు తమ అధ్యక్షతన పనిచేస్తారు కాబట్టి నిరంజన్ మరియు నరేన్ లను ఎలక్షన్స్ కి ముందే అట్లాంటా పిలిపించి రాజీ కుదర్చడానికి ప్రయత్నించిన విషయం వాస్తవం. చివరికి ఎలక్షన్స్ అనివార్యం అయినప్పుడు నిరంజన్ ప్యానెల్ ని బలపరిచారు. ఎదో గులాబీ మొక్కకి అంటు కట్టినట్టు జాగ్రత్తగా ఒక పద్దతి ప్రకారం అంజయ్య ఊరూరా తిరిగి ప్రచారం నిర్వహించగా, శ్రీనివాస్ అట్లాంటాలో కూర్చొని కేంద్రీకృత వ్యూహాలను పక్కాగా అమలుపరిచారు. అట్లాంటా తెలుగు కమ్యూనిటీతో మమేకమై ఉండడం, విపక్షబలం నామమాత్రంగానే ఉండడంతో అట్లాంటా ఓట్స్ లో సింహభాగం దక్కించుకున్నారు. అట్లాంటాలో వచ్చిన మెజారిటీ నిరంజన్ మెజారిటీకి దాదాపు సమానం అవ్వడమే దీనికి నిదర్శనం. అందుకే అట్లాంటా మెజారిటీ తగ్గించడానికి త్రిమూర్తులు అట్లాంటాలోనే మకాంవేసి శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. అలాగే మార్కెటింగ్, పబ్లిసిటీ మరియు కోఆర్డినేషన్లో వీరి బలమైన స్థానిక అనుచరగణం ముఖ్యపాత్ర పోషించింది.
తర్వాత తానా ప్రస్తుత ప్రెసిడెంట్ తాళ్లూరి జయ్ నిరంజన్ ప్యానెల్ కి మంచి బలం అని చెప్పుకోవాలి. సౌమ్యుడు, ఎలాంటి ప్రతికూలతలు లేని జయ్ తన ఎలక్షన్ టైంలో వాడిన అమ్ములపొదిలోని అస్త్రాలను విస్తృతంగా ప్రయోగించారు. నిరంజన్ తోపాటు అమెరికా అంతటిని సుడిగాలి పర్యటనలతో చుట్టేసి సమన్వయపరిచారు. తన ప్రసంగాల్లో ఎక్కడా నెగిటివిటిలేకుండా తనతో మొదలైన మార్పు అంజయ్య మరియు నిరంజన్ ఎలా ముందుకు తీసుకెళ్తారో ఉదాహరణలతో సహా పూసగుచ్చినట్టు వివరించడం ప్లస్ అయ్యింది. వ్యక్తిగతపనులపై ఇండియా అమెరికా మధ్య ప్రయాణిస్తూనే ఎన్నికల పనులను చక్కబెట్టడం విశేషం.
ఇక నరేన్ ప్యానెల్ కొస్తే ప్లస్లు కంటే మైనెస్లే ఎక్కువ. కర్ణుడి చావుకి వందకారణాలు అన్నట్టు, బలమవుతారనుకున్న నాదెళ్ల గంగాధర్, కోమటి జయరాం, వేమన సతీష్ బలహీనతయ్యారు. వీరి వల్ల దగాపడిన తానా పాస్ట్ లీడర్షిప్ అందరూ వ్యతిరేకంగా పనిచేసారు. ప్యానెల్ ని గాలికొదిలేసి ఒక్క నరేన్ వైస్ ప్రెసిడెంట్ ఓటు పై ఫోకస్ చెయ్యడంతో మిగతా కంటెస్టెంట్స్ కూడా సోలో బాటింగ్ చెయ్యడంతో రెండు పక్కలా చెడ్డ రేవడిలా మారింది. అందరిలోకెల్లా నరేన్ కి తక్కువ ఓట్లు రావడం దీనికి నిదర్శనం. కన్వెన్షన్ లో తప్ప నరేన్ గత కొన్నేళ్లుగా తానా సిగ్నేచర్ ప్రోగ్రామ్స్ లో ఎక్కడా కనపడకపోవడం, 2019 కన్వెన్షన్ కి చైర్మన్ గా ఉండి రెండు సంవత్సరాల తర్వాత కూడా ఫైనాన్సియల్స్ కి బోర్డు అప్రూవల్ తీసుకోలేకపోవడం, అమెరికాలో ఉన్నాం అన్న సంగతి మరచి కర్షక శ్రామిక సంఘటిత కూటమి అంటూ ఎవ్వరికీ అర్ధంకాని క్యాంపైన్ స్పీచులు, టీం ఇంక్లూసివ్ అంటూ డివిజివ్ రాజకీయాలు చేసేవాళ్ళని వెంటేసుకొని తిరగడం, ఎక్కువగా ఓట్లు చీలుస్తాడని గోగినేనిశ్రీనివాస్ మీద అతినమ్మకం పెట్టుకోవడం ఇలా ఎన్నో కారణాలు ఓటమికి దారితీసాయి.
*** నిరంజన్ ప్యానెల్ విజయ సూత్రాలు *** + వివాదరహితులైన తాళ్లూరి జయ్, లావు అంజయ్య చౌదరి, లావు శ్రీనివాస్ సపోర్ట్ చెయ్యడం. + తానా ఫర్ ఛేంజ్ – జవాబుదారీతనం, పారదర్శకత, సేవాతత్పరత, నిబద్ధత అనే వీరి నినాదం జనంలోకి బాగా వెళ్లడం. +నిరంజన్ తానా ఫౌండేషన్ చైర్మన్ గా రెండు పర్యాయాలు వివాదాలు లేకుండా అందునా కోవిడ్ సమయంలో కూడా మంచి సేవాకార్యక్రమాలు నిర్వహించడం. + అట్లాంటా, డీసీ, అపలాచియన్ ప్రాంత లోకల్ లీడర్షిప్ గట్టిగా నిలబడడం. + ప్యానెల్ లో నెక్స్ట్ జనరేషన్ యువత, మహిళలు సమపాళ్లలో ఉండడం. + తానా పాస్ట్ ప్రెసిడెంట్స్ మరియు లీడర్షిప్ పబ్లిక్ గా ఎండార్స్ చెయ్యడం. + ప్రతి కంటెస్టెంట్ బ్యాలెట్ లో పైనుంచి కింది వరకు తమ ప్యానెల్ లోని ప్రతి ఒక్కరికీ వోట్ వెయ్యమని అడగడం. + మార్కెటింగ్, స్ట్రాటెజి, పబ్లిసిటీ ఇలా అన్ని రంగాల్లో పకడ్బందీ టీం వర్క్. + లోకల్ గా మంచి కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్న కొత్తవారికి ప్యానెల్ లో చోటు కల్పించడం. + ఏకగ్రీవంగా గెలిచిన పోటీదారులు కూడా బ్లడ్ పెట్టి వర్క్ చెయ్యడం. + తెలుగు రాష్ట్రాలలో కోవిడ్ సెకండ్ వేవ్ రిలీఫ్ కార్యక్రమాలకు లక్ష డాల్లర్ల విరాళం.
*** నరేన్ ప్యానెల్ ఓటమి కారణాలు *** – బలమవుతారనుకున్న నాదెళ్ల గంగాధర్, కోమటి జయరాం, వేమన సతీష్ బలహీనతవ్వడం. వీరి గుత్తాధిపత్యంతో దగాపడిన తానా పాస్ట్ లీడర్షిప్ అందరూ వ్యతిరేకంగా పనిచెయ్యడం. – మేం గెలిస్తే అంజయ్యని ప్రెసిడెంట్ పదవినుంచి బర్తరఫ్ చేస్తాం అని నోటికొచ్చినట్టు తూలనాడడం. – ప్యానెల్ ని గాలికొదిలేసి ఒక్క నరేన్ వైస్ ప్రెసిడెంట్ ఓటు పై ఫోకస్ చెయ్యడంతో మిగతా కంటెస్టెంట్స్ కూడా సోలో బాటింగ్ చెయ్యడం. అందరిలోకెల్లా నరేన్ కి తక్కువ ఓట్లు రావడం దీనికి నిదర్శనం. – సొంతబలాన్ని పెంచుకోవడం మీద ఫోకస్ పెట్టకుండా, గోగినేని శ్రీనివాస్ ఎక్కువగా ఓట్లు చీలుస్తాడని అతినమ్మకం పెట్టుకోవడం. – కన్వెన్షన్ లో తప్ప నరేన్ గత కొన్నేళ్లుగా తానా సిగ్నేచర్ ప్రోగ్రామ్స్ లో ఎక్కడా కనపడకపోవడం. – 2019 కన్వెన్షన్ ఫైనాన్సియల్స్ కి రెండు సంవత్సరాల తర్వాత కూడా బోర్డు అప్రూవల్ తీసుకోలేకపోవడం. – ఎవ్వరికీ అర్ధంకాని నరేన్ గ్రాంధిక భాష స్పీచెస్. తను ఇప్పటివరకు ఏం చేసాడో, గెలిస్తేమున్ముందు ఏం చేస్తాడో ఎక్కడా చెప్పకపోవడం. – క్యాంపెయిన్లో హద్దుమీరి నోరుజారిన లీడర్ల వల్గర్ స్పీచులు. – వారానికోసారి నెగిటివ్ వీడియోస్ తో ఒక పోటీదారు తానా మెంబర్లుని విసిగించడం. – టీం ఇంక్లూసివ్ అంటూ డివిజివ్ రాజకీయాలు చేసేవాళ్ళని వెంటేసుకొని తిరగడం. – లీడర్స్ అందరూ క్యాంపెయిన్లతో బిజీగా ఉండి సెంట్రలైజ్డ్ కోఆర్డినేషన్ లేకపోవడం. – రియాలిటీకి దూరంగా మాకు అన్ని ఓట్లు పడ్డాయి ఇన్ని ఓట్లు పడ్డాయి అని బడాయి చెప్పుకోవడం. – కమ్యూనిటీలో ఇన్వాల్వ్ అవ్వని కొంతమంది కంటెస్టెంట్స్ ప్యానెల్లో ఉండడం. – కీ పోజిషన్స్ కి పోటీదారులు అనర్హులవడం. – బ్యాలెట్స్ అపహరణకు పురమాయించి అణ్యంపుణ్యం ఎరుగని విద్యార్థులు పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడానికి కారణమవడం.