Connect with us

Associations

తానా డల్లాస్ నాయకత్వంలో విజయవంతంగా చదరంగం పోటీలు

Published

on

డల్లాస్ లోని ఇర్వింగ్ నగరంలో ఏప్రిల్ 22న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో చదరంగం పోటీలు విజయవంతంగా జరిగాయి. దాదాపు 75 మంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీలను తానా డల్లాస్ నాయకులు క్రీడల కమిటీ చైర్మన్ వెంకట్ బొమ్మ, లోకేష్ నాయుడు మరియు కృష్ణ వల్లపరెడ్డి సమన్వయపరిచారు. స్థానిక వండర్లాండ్ మోంటెస్సోరిలో జరిగిన ఈ పోటీలను తానా టెక్సాస్ ప్రాంత సమన్వయకర్త సుగన్ చాగర్లమూడి, చంద్రా రెడ్డి పోలీస్, కుమార్ నందిగం తదితరులు విజయవంతం చేయడంలో సహకరించారు. రాబర్ట్ జోన్స్ నిర్వహణలో వివిధ వర్గాలలో విజేతలకు మెమెంటోస్ మరియు మెడల్స్ అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ముందు ముందు యువతకి క్రికెట్ లాంటి వివిధ ఆటలపోటీలు నిర్వహిస్తామని తానా డల్లాస్ నాయకులు తెలియజేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected