అమెరికాలోని షార్లెట్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మరియు క్యూరీ సంస్థలు సంయుక్తంగా వివిధ పోటీలు నిర్వహించారు. 3 విభాగాలైన గణితం, సైన్స్, స్పెల్లింగ్ బీ పోటీలలో స్థానిక పిల్లలు 75 మంది వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తానా అప్పలాచియాన్ ప్రాంత సమన్వయకర్త మల్లికార్జున్ వేమన ఆధ్వర్యంలో తానా షార్లెట్ నాయకులు పూర్ణచంద్ర కొండ్రగుంట, సురేష్ కాకర్ల, కేడర్ బడిశెట్టి, పట్టాభి కాటంనేని, వెంకట్ కృష్ణ కుర్రా, ప్రవీణ్ తాతినేని, రాజేష్ యార్లగడ్డ, శైలజ ముదునూరి, దీపికా కొల్లూరు, ప్రశాంతి మదినేని, శైలజ కొండ్రగుంట, వసంత్ చాగంటి, రాజు నడింపల్లి ఈ పోటీలను విజయవంతం చేసారు. అన్ని విభాగాలలో మొదటి ముగ్గురు విజేతలకు ట్రోఫీస్ అందజేశారు. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందన పత్రాలు ఇవ్వడం జరిగింది.