Connect with us

Associations

త్రిమూర్తులకి గుణపాఠం తప్పదా? అదునుకోసం చూస్తున్న తానా పాస్ట్ లీడర్షిప్స్ కోరిక నెరవేరినట్టేనా? నిరంజన్ టీం విజయం ఖాయమా!

Published

on

అటు అమెరికా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తున్న విషయం ఏంటో తెలిస్తే అవాక్కవుతారు. అదేనండి తానా ఎలక్షన్స్. తానా అధ్యక్ష పదవిని ఇండియాలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లేదా రాష్ట్ర మంత్రి పదవితో సమానంగా చూస్తారంటే ఇందుకేనేమో! గత కొన్ని నెలలుగా అటు నరేన్ కొడాలి ప్యానెల్ ఇటు నిరంజన్ శృంగవరపు ప్యానెల్ పోటాపోటీగా కాంపైన్ నడిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరువైపులా  దాదాపు చెరొక 20 మంది పోటీదారులతో హోరాహోరీగా తలపడుతున్నారు.

నరేన్ కొడాలి ప్యానెల్ ని తానా త్రిమూర్తులు బలపరుస్తుండగా, నిరంజన్ శృంగవరపు ప్యానెల్ ని జయ్ తాళ్లూరి మరియు లావు బ్రదర్స్ బలపరుస్తున్న విషయం బహిరంగమే. తానాని కొన్ని సంవత్సరాలుగా ఏకచక్రాధిపత్యంగా శాసిస్తూ, ఇండియాలో తానా అంటే మేమే మేమంటేనే తానా అంటూ చెప్పుకువచ్చిన త్రిమూర్తులు ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారట. అందుకేనేమో కాలికి బలపం కట్టుకొని మరీ ఊరూరా తిరుగుతున్నారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ మాజీ ఎమ్మెల్యే, వైజాగ్ మాజీ మంత్రివర్యుల చేత కూడా రాయబారం నడిపించారట. కొన్ని సిటీస్ లో ఇంపార్టెంట్ అనుకున్న గడప గడపకీ తిరుగుతున్నారు.

వీరు ఇంతలా ఆదుర్తా పడడానికి అసలు కారణం ఇంకోటి ఉందట. తానాలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ త్రిమూర్తుల బారినపడి దగాపడిన రీజినల్ కోఆర్డినేటర్స్ దగ్గిర నుంచి పాస్ట్ ప్రెసిడెంట్స్ వరకు అందరూ నిరంజన్ శృంగవరపు ప్యానెల్ కోసం తెరవెనుక బ్లడ్ పెడుతున్నారట. ఎన్నో ఏళ్ళ నుంచి ఇప్పటి వరకూ అదును కోసం వేచిచూస్తున్న వీరు నౌ ఆర్ నెవర్ అన్నట్టు తమ పాత కాంటాక్ట్స్ ని బయటికి తీస్తున్నారు. ఇంకొంతమంది మరో అడుగు ముందుకేసి బహిరంగంగానే ఎండార్స్ చేసారు. దీంతో త్రిమూర్తులు సామ దాన భేద దండోపాయాలను వాడుతున్నారట. వర్జీనియా లో టీం నిరంజన్ కు సపోర్ట్ చేసే లేడీస్ తో అసభ్యంగా ప్రవర్తించడం, డల్లాస్ లో ఇద్దరికి వార్నింగ్ ఇవ్వడం, అట్లాంటాలో ఇంకొకరికి ఇండియాలో ఏవో సెటిల్మెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని హామీ ఇవ్వడం ఈ కోవలోకి చెందినవే. అందుకేనేమో ఒక్కో సిటీని 3 నుంచి 5 సార్లు చుట్టివస్తున్నారు. చివరికి ప్యానెల్ ని గాలికొదిలేసి మాకు ఒక్క ప్రెసిడెంట్ ఓటు నరేన్ కొడాలి కి వేయండి మిగతావి మీ ఇష్టం అని బేరసారాలు నడుపుతున్నారట. దీంతో ఆ ప్యానెల్ లోని మిగతా వారు కూడా సొంత బ్యాటింగ్ మొదలు పెట్టడంతో రెండు పక్కలా చెడ్డ రేవడిలా మారిందట నరేన్ కొడాలి పరిస్థితి.

ఇంకో పక్క నిరంజన్ శృంగవరపు ప్యానెల్ లో ప్రతి ఒక్కరూ ఎవరిని రిక్వెస్ట్ చేసినా బ్యాలెట్ లో పైనుంచి కింది వరకు తమ ప్యానెల్ లోని ప్రతి ఒక్కరికీ వోట్ వెయ్యమని అడుగుతుండడం వారికి బాగా కలిసొస్తుంది. అంతే కాకుండా నెక్స్ట్ జనరేషన్ యువత, మహిళలు సమపాళ్లలో ఉండడం, అలాగే క్లీన్ ఇమేజ్ ఉన్న జయ్ తాళ్లూరి, అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్ లావు ల బలం ఈ టీం కి బాగా ప్లస్ అవుతుంది. అంతే కాకుండా తానా ఫౌండేషన్ చైర్మన్ గా రెండు పర్యాయాలు ఎక్కడా కాంట్రవర్సిస్ లేకుండా అందునా కోవిడ్ సమయంలో కూడా మంచి సేవాకార్యక్రమాలు నిర్వహించడం, తమ టీం నిరంజన్ తానా లో తీసుకువచ్చే మార్పులను చాలా క్లియర్ గా వివరిస్తూ నిరంజన్ ముందుకు వెళుతుండగా నరేన్ మాత్రం ఎవ్వరికీ అర్ధం కాని గ్రాంధిక భాషతో వెనుకబడ్డారు. అంతేకాకుండా కన్వెన్షన్ లో తప్ప తను గత కొన్నేళ్లుగా తానా సిగ్నేచర్ ప్రోగ్రామ్స్ అయిన బ్యాక్ ప్యాక్ డిస్ట్రిబ్యూషన్, తానా స్రవంతి, తానా కేర్స్ లాంటి ప్రోగ్రామ్స్ లో ఎక్కడా కూడా కనపడకపోవడం మైనస్సే. 2019 కన్వెన్షన్ కి చైర్మన్ గా చేసిన నరేన్ రెండు సంవత్సరాల తర్వాత కూడా ఫైనాన్సియల్స్ కి బోర్డు అప్రూవల్ తీసుకోకపోవడం తనమీద ఉన్న నమ్మకానికి గండి కొట్టింది.

ఇదంతా చూస్తుంటే టీం నిరంజన్ విజయం ఖాయమేనని, త్రిమూర్తులకి గుణపాఠం తప్పదన్నట్టు, తానా పాస్ట్ లీడర్షిప్స్ కోరిక నెరవేరినట్టేనని అమెరికా వాసులు నమ్ముతున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected