ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) గత కొంతకాలంగా ప్రతి నెలా రెండవ శనివారం రోజున ‘తానా తెలుగు సాంస్కృతిక సిరులు’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరంపరలో భాగంగా రాబోయే శోభకృత నామ ఉగాది పండుగను పురస్కరించుకొని ఒక కార్యక్రమం నిర్వహించారు.
ఈ రోజు మార్చి 11న ప్రముఖ జానపద కళాకారులు డాక్టర్ లింగా శ్రీనివాస్ ఆధ్వర్యంలో లోక కళా వికాస పరిషత్తు, జగిత్యాల వారి సమర్పణ లో ‘జాన పదం – జ్ఞాన పథం’ అనే కార్యక్రమాన్ని తానా (TANA) వారు నిర్వహించారు. పూర్తి కార్యక్రమాన్ని పై వీడియోలో తిలకించవచ్చు.
సంస్కృతి, సాహిత్యం పట్ల ప్రేమాభిమానాలతో కళామతల్లి ముద్దు బిడ్డలైన కళాకారులను ప్రోత్సహించే విధంగా అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన, డాక్టర్ విజయ్ భాస్కర్ దీర్ఘాశి పర్యవేక్షణలో, తానా సాంస్కృతిక సేవా కార్యదర్శి శిరీష తూనుగుంట్ల ఆధ్వర్యంలో ఈ తానా తెలుగు సాంస్కృతిక సిరులు కార్యక్రమాన్ని కొత్తగా నిర్వహిస్తున్నారు.