విద్య, ఆరోగ్య, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలకి తానా పెట్టిన పేరు. ఎప్పటికప్పుడు అందరికి ఉపయోగపడే క్రొత్త కార్యక్రమాలతో ముందుకు వెళుతుంది ఈ సంస్థ. ఈ సంవత్సరం క్రొత్తగా “తానా తెలుగు సాంస్కృతిక సిరులు” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తెలుగు భాషా సంస్కృతులు చాలా పురాతన మైనవి. కూచిపూడి, పేరిణి నాట్యాలు, సురభి నాటకం, కర్ణాటక సంగీతం, హరికథ, బుర్ర కథ, డప్పు, తప్పెట గుళ్ళు గరగలు, కోలాటం, దింసా, కొమ్ముకోయ వంటి వందలాది జానపద, గిరిజన కళా రూపాలకు తెలుగు నేల పురుడు పోసి పెంచి పెద్ద చేసి ప్రపంచానికి అందించింది. ఆధునిక కాలానికి చెందిన లలిత సంగీతం, గజల్, వివిధ రకాల వాయిద్య సాధనాల ప్రతిభ తెలుగు వారు స్వంతం చేసుకున్నారు.
ఈ కళల్లో కొన్నిఅర కొర ఆదరణతో కొట్టుమిట్టాడుతున్నాయి. మరికొన్ని అవసానదశకు చేరుకున్నాయి. తెలుగు వారి సృజనాత్మకతకు, కళా నైపుణ్యానికి చిహ్నాలైన వీటిని ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈ నెల 11 వ తేది నుండి ఈ క్రొత్త కార్యక్రమం “సింహాచలశాస్త్రి గారి హరికథామృతం” తో ప్రారంభి స్తున్నామని తెలియజేస్తున్నారు తానా సాంస్కృతిక సేవా కార్యదర్శి శిరీష తూనుగుంట్ల. ప్రతి నెలా రెండవ శనివారం ఒక కళారూపంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.