రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని, తానా రైతు కోసం కార్యక్రమం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) వీరవల్లిలో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులకు రూ. 20 లక్షల విలువైన పవర్ స్ప్రేయర్లు, పరజాలు మరియు భద్రతా కిట్లు అందజేశారు.
ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంసెట్టి సుభాష్ (Vasamsetti Subhash), కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె. బాలాజీ, గన్నవరం ఎమ్మెల్యే శ్రీ వెంకటరావు యర్లగడ్డ (Yarlagadda Venkata Rao), గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ గుడవల్లి నరసయ్య లాంటి ప్రముఖులు హాజరయ్యారు.
రైతుల కోసం తానా కొనసాగిస్తున్న సంకల్ప సేవ
తానా (TANA) అధ్యక్షుడు నరేన్ కొడాలి (Naren Kodali), ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, ట్రెజరర్ రాజా కసుకుర్తి (Raja Kasukurthi) నాయకత్వంలో, పురుగుమందులు తగ్గించడానికి ఉపయోగపడే ఆధునిక పవర్ స్ప్రేయర్లు మరియు కోత అనంతరం పంటలను వర్షం, గాలి వంటి సమస్యల నుండి రక్షించే పరజాలు పంపిణీ చేశారు.
మాతృభూమిపట్ల తానా సేవను ప్రశంసించిన ప్రజా ప్రతినిధులు
గ్రామ రైతులు తానా (TANA) చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ, పేద మరియు మధ్యతరగతి రైతులు, వ్యవసాయ కార్మికుల జీవితాల్లో ఇవి ఎంతో ఉపయోగకరమని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న నాయకులు, ముఖ్యంగా తానా ట్రెజరర్ రాజా కసుకుర్తి (Raja Kasukurthi) మరియు ఇతర నాయకుల సేవాస్ఫూర్తిని అభినందించారు.
భారతీయ రైతుల సంక్షేమం కోసం ప్రవాస భారతీయ సంస్థ చేస్తున్న ఈ సేవ “అమూల్యమైనది, మాతృభూమికి గొప్ప సేవ” అని పేర్కొన్నారు. స్థానిక తానా (TANA) వాలంటీర్ మరియు రైతు నాయకుడు శ్రీధర్ కలపాల కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ, పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
రైతులు ప్రపంచాన్ని పోషించే వారు కాబట్టి, ఇలాంటి సేవలు చాలా అవసరమని తెలిపారు. గ్రామంలోని పలువురు రైతులు, రైతు సంఘం నాయకులు శ్రీ అళ్ళ గోపాలకృష్ణ, శ్రీ బుజ్జి గుండపనేని, శ్రినివాస్ వెములపల్లి ఈ కార్యక్రమంలో పాల్గొని తానా (Telugu Association of North America – TANA) కు కృతజ్ఞతలు తెలిపారు