తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ ఇండియా ట్రిప్ ముగించుకొని ఈ మధ్యనే అమెరికా విచ్చేసిన సంగతి తెలిసిందే. పెళ్లితోపాటు తానా తరపున వివిధ కార్యక్రమాలను ముగించుకొని వచ్చీరాగానే యాక్షన్ లోకి దిగినట్టు తెలుస్తుంది. తన ఇండియా ట్రిప్ కి ముందే కొన్ని క్రొత్త క్రీడా కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ, ముఖ్యంగా యువతకి తానా క్రీడా కార్యక్రమాలను చేరువచేసేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే గత వారాంతం తానా నేషనల్ అడ్హాక్ కమిటీలలోని క్రీడల ఛైర్స్ మరియు కోఛైర్స్ తో సమావేశమయ్యారు. అలాగే ఈ వారాంతం క్రీడా కమిటీలోని సమన్వయకర్తలందరితో కలిపి మరోసారి సమావేశమయ్యారు. రాబోయే కాలంలో ఏమేం క్రీడలు నిర్వహించాలి, వాటి ప్రణాళిక, తన అంచనాలు ఏంటి వంటి తదితర వివరాలను కూలంకుషంగా చర్చించారు.
ఎదో పదవి వచ్చింది కదా అన్నట్టు కాకుండా, కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ కనీసం ఒక క్రీడ అన్నా నిర్వహించాలని, దానికి తన తోడ్పాటు తప్పకుండా ఉంటుందని, ఈ టర్మ్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ముందు ముందు రాబోయే వారికి ఆదర్శంగా ఉండాలని దిశానిర్దేశం చేసారు. అందరి ఆలోచనలు, సలహాలు తీసుకోవడంతోపాటు తన విజన్ ఏంటో చాలా స్పష్టంగా వివరించారు.
ఇంతకు ముందే త్రీ ఆన్ త్రీ అంటూ కొత్త ఫార్మాట్ తో బాస్కెట్ బాల్, బ్రింగింగ్ బ్యాక్ అవర్ ట్రెడిషనల్ స్పోర్ట్ అంటూ కబడ్డీ ఛాంపియన్షిప్ మరియు ఇండియాలో వికలాంగుల క్రికెట్ పోటీలను విజయవంతంగా నిర్వహించి, ఇప్పుడు ఈ ప్రణాళికలతో ముందుకురావడంతో శశాంక్ ఈస్ లీడింగ్ బై ఎగ్జామ్పుల్ అని అర్ధం అవుతుంది. అలాగే జాతీయ స్థాయిలో బిగ్గర్ స్కేల్లో ఒక మెగా క్రీడా కార్యక్రమ నిర్వహణకు ప్రణాళిక రచిస్తున్నట్లు, అది ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున పూర్తి వివరాలు ముందు ముందు తెలియపరుస్తామని చెప్పారు. ఇదంతా చూస్తుంటే క్రీడా కమిటీని చక్కగా లీడ్ చేస్తూ శశాంక్ ఈస్ ఇన్ యాక్షన్ విత్ యాక్షన్ ప్లాన్ అని అనుకుంటున్నారు తానా సభ్యులు.