ఆంధ్రప్రదేశ్, రాజమహేంద్రవరంలోని ప్రియదర్శిని చెవిటి, మూగ ఆశ్రమ పాఠశాలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ సేవా కార్యక్రమాలు చేపట్టింది. డిసెంబర్ 21న తానా లైబ్రరీస్ కోఆర్డినేటర్ సతీష్ చుండ్రు ఆధ్వర్యంలో బధిర విద్యార్ధులకు చాపలు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, గుడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ హాజరయ్యారు. అంజయ్య చౌదరి మాట్లాడుతూ బధిర విద్యార్ధుల మధ్య తానుండి సేవాకార్యక్రమం చేయడం ఆనందంగా ఉందని, తానా ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ తానా ద్వారా గతంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, కరోనా సమయంలో మంచి సేవలు అందించారని పేర్కొన్నారు.
సతీష్ చుండ్రు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవీన్ కుమార్ కాశి, తానా ప్రతినిధులు జనార్ధన్ నిమ్మలపూడి, రాజా కసుకుర్తి, శశాంక్ యార్లగడ్డ, నగర ప్రముఖులు కంటిపూడి శ్రీనివాస్, ఉప్పులూరి జానకిరామయ్య, బుడ్డిగ రాధా, మొల్లి చిన్నియాదవ్, సెనివాడ అర్జున్, వానపల్లి శ్రీనివాస్, జి.కొండబాబు, కెవి శ్రీనివాస్, కవులూరి వెంకట్రావు, సంసాని ప్రసాద్, కంచిపాటి గోవింద్, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, మొండి సత్యనారాయణ, పెదగాడ సూరాచార్యులు, దొంతుమళ్ల వీర్రాజు, గొరసా అప్పల కొండ, పందాడి రాజు, కాసా వినయ్ తదితరులు పాల్గొన్నారు.
తమ పాఠశాలలో తరచుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గన్ని కృష్ణకు, తానా లైబ్రరీస్ కోఆర్డినేటర్ సతీష్ చుండ్రు కి ప్రియదర్శిని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు స్వప్న కృతజ్ఞతలు తెలిపారు.