Connect with us

Festivals

వినాయక చవితి మహా ప్రసాదాన్ని దక్కించుకున్న చికాగో తానా నాయకులు

Published

on

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఆధ్వర్యంలో వైభవంగా 7 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు చికాగో నగరంలో నిర్వహించారు. నిమ్మజ్జనం సందర్భంగా హోరాహోరీగా జరిగిన మహా ప్రసాదం వేలంపాటలో తానా మిడ్ వెస్ట్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ హను చెరుకూరి గణేష్ లడ్డుని దక్కించుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో ప్రెసిడెంట్ మల్లా రెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ మనోజ్ సింగంశెట్టి, హరిందెర్ రెడ్డి పులియాల, ప్రవీణ్ కొండూరు, హీనా త్రివేది, నిలేష్ తోపీవాల తదితరులు ఘనంగా నిర్వహించారు.

తానా చికాగో సీనియర్ నాయకులు హేమ కానూరు, కృష్ణ మోహన్, చాందినీ దువ్వూరి, చిరంజీవి గల్లా, రవి కాకర, సతీష్ మచ్చ కార్యక్రమం విజయవంతం అవ్వడంలో సహకరించారు. గణేష్ నిమజ్జన వీడ్కోలు యాత్రలో భాగంగా హెలికాప్టర్ నుంచి కురిపించిన పూల వర్షం పిల్లలకు, భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పిల్లలకు ప్రత్యేకంగా నిర్వహించిన కాన్వాస్ పెయింట్ పోటీలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు కాంగ్రెస్ రెప్రజెంటేటివ్ రాజా కృష్ణమూర్తి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ నీటిపారుదల శాఖా మాత్యులు దేవినేని ఉమా మహేశ్వరరావు సర్టిఫికెట్లు అందజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected