Connect with us

Movies

RRR, Oscar: ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ లభించడంపై తానా అధ్యక్షులు హర్షం

Published

on

95వ ఆస్కార్‌ వేడుకల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ (Oscar) లభించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు లభించడం తెలుగు చలన చిత్రరంగానికే కాక యావత్‌ భారతదేశానికే గర్వకారణమని చెప్పారు. ఈ అవార్డును చేజిక్కించుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ను తానా తరపున అభినందిస్తున్నట్లు అంజయ్య చౌదరి తెలిపారు.

95వ ఆస్కార్‌ వేడుకల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR Telugu Movie) సినిమాలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా నాటు నాటు నిలిచింది. ఇండియన్‌ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్‌’ (Oscar) అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సాకారం చేసింది.

అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ ‘నాటు నాటు…’ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. కీరవాణి స్వరపరచిన ఈపాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవపాడిన సంగతి తెలిసిందే. ప్రేమ్రక్షిత్‌ కొరియోగ్రఫీ చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును అందుకుంటూ వేదికపై పాట పాడారు.

ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబ్టటింది. అంతేకాదు, గోల్డెన్‌ గ్లోబ్‌, సినీ క్రిటిక్స్‌ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమాపై హాలీవుడ్‌ దిగ్గజాలు జేమ్స్‌ కామెరూన్‌, స్పీల్‌ బర్గ్‌ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

Anjaiah Chowdary Lavu
TANA President

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected