Connect with us

Education

తానా కన్వెన్షన్ లో జులై 9న పాఠశాల ఆత్మీయ సమావేశం

Published

on

తానా కన్వెన్షన్ ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) అధ్యక్షతన, రవి పొట్లూరి (Ravi Potluri) కన్వీనర్ గా, శ్రీనివాస్ లావు (Srinivas Lavu) ఛైర్మన్ గా ఘనంగా నిర్వహించనున్నారు.

తానా కన్వెన్షన్ (23rd TANA Conference) పురస్కరించుకుని ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో వివిధ జిల్లాల, కాలేజీల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తానా పాఠశాల వారి ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేశారు.

జులై 9 ఆదివారం రోజున రూమ్ నంబర్ 103-సి లో మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఈ ఆత్మీయ సమావేశంలో ప్రముఖ సాహితీవేత్తలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, బీరం సుందర రావు, సినీ నటులు డా. భరత్ రెడ్డి, రవి వర్మ, అలాగే సుబ్బారావు చెన్నూరి పాల్గొననున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected