Connect with us

Language

విద్యార్థులకు అభినందన @ అట్లాంటా తానా పాఠశాల వార్షికోత్సవం

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తానా పాఠశాల’ వార్షికోత్సవం అట్లాంటా నగరంలో శనివారం సెప్టెంబర్ 24వ తేదీ కమ్మింగ్ లైబ్రరీ లో ఘనంగా జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్న ఈ వార్షికోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది.

తానా సౌత్ఈస్ట్ రీజినల్ రిప్రజంటేటివ్ వెంకట్ మీసాల, పాఠశాల అట్లాంటా నగర ప్రధాన నిర్వాహకులు సునీల్ దేవరపల్లి నిర్వహణ లో సాగిన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. తానా పాఠశాల అధ్యక్షులు నాగరాజు నలజుల ‘తానా’ పాఠశాల నిర్వాహకులకు ప్రత్యేక అభినందనల సందేశాన్ని పంపించారు.

ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా పాఠశాలలో పిల్లలను చేర్పించి తెలుగు భాషను భావితరాలకు అందించడానికి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియచేశారు. పాఠశాలలో ఉత్తీర్ణత పొందిన బాలబాలికలకు ప్రశంశాపత్రాలు అందజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected