ఆస్టిన్ బ్రషీ క్రీక్ లేక్ పార్క్ లో తానా వారి పాఠశాల 2023-24 సంవత్సరానికి అడ్మిషన్ కార్యక్రమం మరియు పుస్తకాల పంపిణీ ఆగష్టు 12 ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు జరిగింది. మొదటగా పాఠశాల విద్యార్థుల ప్రార్ధన తో కార్యక్రమం మొదలుపెట్టారు. స్థానిక పాఠశాల కో ఆర్డినేటర్ శ్రీమతి రజని మారం కార్యక్రమానికి వచ్చిన తల్లితండ్రులకు, పిల్లలకు, అతిధులకు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందచేశారు.
పాఠశాల ద్వారా పిల్లలకే కాకుండా తెలుగు నేర్చుకోవాలని ఆసక్తి వున్న పెద్దలకు కూడా భోదన చేస్తున్నామని వివరించారు. పాఠశాల చైర్మన్ శ్రీ నాగరాజు నలజుల గారు మాట్లాడుతూ పాఠశాల అతి తక్కువ రుసుముతో అందిస్తున్న పలుకు, అడుగు, పరుగు మరియు వెలుగు కోర్సుల గురించి వివరించారు. అమెరికాలో పిల్లలకు తెలుగు భాష నేర్పించాల్సిన ఆవశ్యకతను, దాని కోసం పాఠశాల చేస్తున్న కృషిని వివరించారు.
వెలుగు కోర్స్ పూర్తిచేసిన విద్యార్థులు పాఠశాలలో బోధనా మరియు ఇతర మార్గాల ద్వారా ఎలా వాలంటీర్ గంటలు పొందవచ్చో మరియు అవి వారికి హైస్కూల్ మరియు కాలేజీ లో ఎలా ఉపయోగపడతాయో వివిరించారు. గత మూడు సంవత్సరాలుగా ఆస్టిన్ రీజియన్లో పాఠశాల అభివృద్ధిని, దానికోసం కృషిచేసిన రజని గారిని మరియు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందిని శ్రీనివాస్ ఇరివెంటి, రామ్ శ్యామ్ భమిడిపాటి,వర్ధిక మద్దుకూరి, కీర్తి సుస్మిత బుద్ధ, లక్ష్మి పైడి లను అభినందించారు.
తానా అధ్యక్షుడు శ్రీ నిరంజన్ శృంగవరపు గారు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు మరియు తల్లి తండ్రులను అభినందిచారు.TANA సౌత్ వెస్ట్ రీజియన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సుమంత్ పుసులూరి మాట్లాడుతూ పాఠశాలకు TANA అందిస్తున్న సహకారాన్ని వివరించారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను మరియు ముందు తరాలకు అందించాల్సిన భాద్యతను గుర్తుచేశారు. కొత్తగా చేరిన ఉపాధ్యాయులకు స్వాగతం పలికారు.
TANA సభ్యులు రామ్ మారం గారు పాఠశాల అభివృద్ధికి వాళ్ళ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. TANA సభ్యులు చిరంజీవి, శ్రీధర్ పోలవరపు, బాలాజీ పర్వతనేని, బాలాజీ గుడి, లెనిన్ యర్రం, మాధవ్, కిరణ్ మరియు కుమార్ పిచికల చురుకుగా పాల్గొన్నారు. ప్రత్యేక అతిధిగా స్థానిక గాస్ట్రోఎంటరోలాజిస్ట్ డా. ప్రవీణ్ సంపత్ గారు విచ్చేశారు.
డా. ప్రవీణ్ సంపత్ గారు మాట్లాడుతూ ఇక్కడి పిల్లలకు తెలుగు చదువుట, రాయుట మరియు మాట్లాడుట పాఠశాల ద్వారా నేర్పుతున్నందుకు పాఠశాలను అభినందించారు. ఇక్కడున్న తెలుగు వాళ్లందరికీ వైద్యుడిగా తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ నీటిపారుదల పరిశ్రమ చైర్మన్ శ్రీ గోపాల్ కృష్ణ గారు మాట్లాడుతూ అమెరికా లో తెలుగు భాష అభివృద్ధికి TANA వారు పాఠశాల ద్వారా చేస్తున్న కృషిని అభినందించారు. చివరగా అల్పాహారవిందుతో కార్యక్రమం ముగిసింది.