టెక్సస్ రాష్ట్రం, ఆస్టిన్ రీజియన్లో తానా పాఠశాల మూడవ విద్యా సంవత్సరం 2022-23 సంవత్సరానికి తరగతులు ప్రారంభించి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, మాజీ అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి వీడియో కాల్ ద్వారా చిన్నారులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల డల్లాస్ నుండి ఆస్టిన్ కి విచ్చేసి ఉపాధ్యాయులైన రజని మారం, వర్ధిక, శ్రీనివాసరావు ఇరువంటి, రామ్ శ్యాము భమిడిపాటి, కీర్తి సుస్మిత బుద్ధ మరియు లక్ష్మి పైడి లను ఘనంగా సత్కరించారు. మురళీ తాళ్లూరి, రజని మారం, రాము మారం లను ప్రత్యేకంగా అభినందించారు.
తానా మరియు పాఠశాల కో ఆర్డినేటర్లు సమన్వయంతో పని చేసి ఈ కార్యక్రమం మరింత విజయవంతం అయ్యేలా చూడాలని కోరారు. తానా జాయింట్ సెక్రటరీ మురళీ తాళ్లూరి మరియు రామ్ మారం మాట్లాడుతూ ఆస్టిన్ లో తానా పాఠశాలను బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు.
దీనికి సహకరిస్తున్న ఆస్టిన్ పాఠశాల ఉపాధ్యాయులకు, తానా మరియు పాఠశాల కార్యావర్గానికి ధన్యవాదములు తెలిపారు. రజని మారం ఉపాధ్యాయులను సమన్వయం చేసుకుంటూ టీమ్ ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన సాయి విష్ణుబొట్ల, ప్రసన్న చిన్నారులను మరియు కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో తానా మరియు పాఠశాల కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.