అమెరికా వ్యాప్తంగా వందలాది మంది ప్రవాస భారతీయుల చిన్నారులకు తెలుగు నేర్పించే సమున్నత వేదిక పాఠశాల. మన యువతే మన వారసత్వంగా భావిస్తూ స్వర్ణోత్సవాలు అడుగు దూరంలో ఉన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రతిష్టాత్మకంగా పాఠశాల నిర్వహిస్తుంది.
ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తానా మాజీ అధ్యక్షులు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు శ్రీ తోటకూర ప్రసాద్, తానా (TANA) అధ్యక్షులు నరేన్ కొడాలి (Naren Kodali), కోశాధికారి రాజా కసుకుర్తి (Raja Kasukurthi) ముఖ్య అతిధులుగా పాల్గొని, మన మాతృభూమి తెలుగింటి పండుగ ఉగాది పురస్కరించుకొని మన మాతృబాష తెలుగు వెలుగే సజీవ పునాదిగా సాగుతున్న పాఠశాల వేదికను వందలాది మంది తల్లిదండ్రులు అభినందించారు.
తేనెలొలుకు మన మాతృబాష తెలుగు , రేపటి తరం కోసం – సజీవ ఆస్తిగా నిలుపుకుందాం, సగౌరవ అస్తిత్వంగా చాటుకుందాం అంటూ ఉపాధ్యాయులు, నిర్వాహకులు ప్రసాద్ మంగిన, అమృత ముత్యాల, శ్రీ రంజని శేట్టులూరి, రంజిత ఆదిమూలం, శేఖర్ చంద్ర తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ మాతృబాష తెలుగును ఇక ముందు తరాలకూ శాశ్వత ఆస్తిగా అందించే స్ఫూర్తి నిలబెట్టుకుంటామని తానా (Telugu Association of North America – TANA) పాఠశాల అధ్యక్షులు భాను మాగులూరి (Bhanu Maguluri) తెలిపారు.