TANA @ Minneapolis: ప్రెసిడెంట్ నరేన్ కోడాలి గారు మరియు వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీనిలావు లావు గారి ప్రోద్భలంతో TANA North Central Chapter RVP రామ్ వంకిన ఆధ్వర్యంలో Minneapolis, Minnesota లో Feed My Starving Children (FMSC) సెంటర్ లో ఫుడ్ ప్యాకింగ్ చేయడం ఐనది.
ఈ ఈవెంట్ లో సుమారు 70 వాలంటీర్స్ పాల్గొని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో ఆరు ఏళ్ళనుంచి అరవైయ్ ఏళ్ళ వయసు వున్నవారు అత్యంత శ్రద్ధతో ఉత్సహంగా పాల్గొన్నారు. TANA టీం ప్యాక్ చేసిన ఈ పోషక మైన ఈ ఆహరం పలు దేశాలలో అవసరయమైన చిన్నారులకు ఆకలి లేకుండా చేస్తుంది.
ఈ సందర్భంగా Feed My Starving Children (FMSC) నిర్వాహకులు మాట్లాడుతూ, తానా కమ్యూనిటీకి చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. తానా (TANA) అవసరమైన పిల్లలకు పోషకమైన ఆహరం పంపిణీ చేసేందుకు తమ వంతు సహకారం పలు సందర్భాల్లో అందిస్తున్నందుకు వారు స్థానిక తానా నాయకులకు ధన్యవాదాలు చెప్పారు.
TANA ప్రెసిడెంట్ Dr. Naren Kodali తరువాత తమ సందేశం ఇస్తూ Telugu Association of North America నార్త్ సెంట్రల్ టీం మరియు ఈ కార్యక్రంలో పాల్గొన్న అందరును ప్రసశంసిస్తూ ఈ సేవా కార్యక్రమాలను అమెరికా లో పలు రాష్ట్రాలలో నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచినందుకు తానా ప్రతినిధి రామ్ వంకిన (Ram Vankina) కి Feed My Starving Children (FMSC) అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచెసారు. వాలంటీర్ల సహాయం వల్లనే ఈ సేవాకార్యక్రమం సాధ్యమయ్యిందని నిర్వాహకులు అన్నారు. ఈ సందర్భంగా యూత్ వాలంటీర్స్ కి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి తానా నార్త్ సెంట్రల్ వాలంటీర్స్ వెంకట్ జువ్వ, వేదవ్యాస్ అర్వపల్లి, జయరాం నల్లమోతు, అజయ్ తాళ్లూరి, రామకృష్ణ అన్నే, సురేష్ బొర్రా, కోటేశ్వరరావు పాలడుగు, అనిల్ పోతకమూరి, చంద్ర చెన్నుపాటి, మధు గొడుగుచింత, పూర్ణ గుర్రం, విజయ ముత్యల, ఇందు నల్లమోతు తోడ్పడ్డారు.
అలాగే అంజనీ పోతకమూరి, శ్రేయ చెన్నుపాటి, పుష్ప బొర్రా, వంశి కొల్లా, ప్రదీప్ కోగంటి, బాబ్జి చెన్నుపాటి, శ్రీనివాస్ కన్నెగంటి, శ్రీకృష్ణ గార్లపాటి, పవన్ యార్లగడ్డ, రాజేష్ రెడ్డి, నాగ్ బొల్లు, శ్రీధర్ కడియాల, వెంకట్ ఉయ్యురు, కొండయ్య నారా మరియు ఎందరో సహకారం అందిచడం అయినది.