Connect with us

Health

TANA New York Chapter నిర్వహణలో CPR & AED సర్టిఫికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విజయవంతం

Published

on

New York: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో శనివారం, ఫిబ్రవరి 7న న్యూయార్క్‌లోని అసమై హిందూ టెంపుల్‌ (AsaMai Hindu Temple)లో నిర్వహించిన CPR & AED సర్టిఫికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఘనంగా మరియు విజయవంతంగా జరిగింది.

సమాజానికి ప్రాణాలను రక్షించే (Life-Saving) అత్యవసర నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు కుటుంబాల నుండి విశేష స్పందన లభించింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మొత్తం 30 మందికి ప్రామాణిక శిక్షణ అందించబడింది.

అత్యవసర పరిస్థితుల్లో సమయోచితంగా స్పందించి ప్రాణాలను రక్షించగలిగే ఈ శిక్షణ సమాజానికి ఎంతో ఉపయోగకరమైంది. ప్రతి పాల్గొన్న వారికి పరీక్ష నిర్వహించి, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) నుండి 2 సంవత్సరాల సర్టిఫికేషన్ అందజేయబడింది. ఈ కార్యక్రమం ద్వారా పాల్గొన్న వారిలో అవగాహన, ఆత్మవిశ్వాసం మరియు సేవాభావం మరింత పెరిగాయి.

ఈ కార్యక్రమం TANA అధ్యక్షులు శ్రీ నరేన్ కొడాలి (Naren Kodali) గారి ప్రేరణాత్మక నాయకత్వంలో, TANA హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్ శ్రీమతి మాధురి యెలూరి గారి పర్యవేక్షణలో, TANA Treasurer శ్రీ రాజా కసుకుర్తి గారి సహాయ సహకారాలతో, TANA న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు గారి సమర్థవంతమైన సమన్వయంతో విజయవంతంగా పూర్తైంది.

ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లుగా ప్రసాద్ కోయి (Prasad Koyi), సుచరిత అనంతనేని, రజిత కల్లూరి, జితేంద్ర యార్లగడ్డ, దిలీప్ ముసునూరు మరియు శ్రీనివాస్ నాదెళ్ళ గారు సమర్థవంతంగా నిర్వహణలో భాగస్వాములయ్యారు. TANA NY టీమ్ సభ్యులుగా రాజేశ్ కడియాల, కలీమ్ మహమ్మద్ మరియు ప్రదీప్ అరవేటి గార్లు తమ అమూల్యమైన సేవలను అందించారు.

కార్యక్రమ విజయానికి కీలకంగా నిలిచిన యువ వాలంటీర్లు (Volunteers) — ఆశ్రిత కోయి, శరణ్ సాయి భర్తవరపు, గీతిక చల్లా, విష్ణు సాయి ఆశ్రిత్ రాచకుంట, సుధీక్ష ముసునూరు, సుహాస్ ముసునూరు, సమన్విత మిన్నెకంటి — వారికి TANA NY టీమ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ఈ CPR & AED ట్రైనింగ్ కార్యక్రమానికి ముఖ్య సహకారం అందించిన Xavier University School of Medicine యాజమాన్యానికి TANA న్యూయార్క్ టీమ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే ఈ కార్యక్రమానికి న్యూయార్క్‌లోని స్థానిక సంస్థలైన TLCA అధ్యక్షులు శ్రీ సుమంత్ రామశెట్టి గారు మరియు NYTTA అధ్యక్షులు శ్రీ రవీంద్ర కోడెల గారు హాజరై, TANA NY టీమ్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ సేవా కార్యక్రమాలను అభినందించారు.

ముఖ్యంగా CPR ట్రైనింగ్ ప్రోగ్రామ్ సమాజానికి ఎంతో ఉపయోగకరమైందని పేర్కొంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ భర్తవరపు గారు మాట్లాడుతూ, “సమాజ సేవే లక్ష్యం” అనే నినాదంతో తానా న్యూయార్క్ టీమ్ (Tana New York Team) భవిష్యత్తులో కూడా మరిన్ని సార్థకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి అండగా నిలుస్తుందని తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected