Connect with us

Food

New London, Connecticut: తానా న్యూ ఇంగ్లండ్ బృందం సేవా కార్యక్రమాలకు శ్రీకారం

Published

on

న్యూ ఇంగ్లండ్ తానా (TANA New England Chapter) విభాగం నుంచి కొత్తగా ఎన్నికైన రీజినల్ రిప్రజంటేటివ్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి మరియు ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ యెండూరి స్వచ్ఛమైన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు (Service Activities) శ్రీకారం చుట్టారు.

జనవరి 21 ఆదివారం కనెక్టికట్ లోని న్యూ లండన్ (New London) ప్రాంతం మంచు (Snow) తో కప్పబడి ఉంది. తానా న్యూ ఇంగ్లండ్ బృందం స్థానిక నిరాశ్రయుల ఆశ్రయంలో 150 మందికి ఆహారాన్ని అందించింది. నిరాశ్రయులైన ప్రజలు ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని తానా న్యూ ఇంగ్లండ్ బృందాన్నిఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రసాద్ సోంపల్లి, శ్రీనివాస్ యెండూరి, తేజ శర్మ, గోపి నెక్కలపూడి, నరేన్, గీత, ఉమ, పద్మ, రేఖ తదితరులు పాల్గొన్నారు. కష్ట సమయాల్లో చేదోడు వాదోడుగా నిలిచిన న్యూ ఇంగ్లండ్ తానా విభాగ సభ్యులను కనెక్టికట్ (Connecticut) లోని అందరూ అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected