Connect with us

Women

మే 6 న తానా న్యూజెర్సీ చాప్టర్ మదర్స్ డే ఈవెంట్

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ న్యూజెర్సీ చాప్టర్ మదర్స్ డే సెలబ్రేషన్స్ శుక్రవారం మే 6 న నిర్వహిస్తున్నారు. తానా న్యూజెర్సీ నాయకత్వం ప్రత్యేకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటి పూజ ఝవేరి, టాలీవుడ్ గాయని సుమంగళి మరియు మన టీవీ యాంకర్ లావణ్య గూడూరు పాల్గొననున్నారు. కుటుంబ సమేతంగా అందరూ ఆహ్వానితులే.

న్యూజెర్సీ లోని స్థానిక ఈ హోటెల్ బ్యాంక్వెట్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్ లో నిర్వహిస్తున్న ఈ మదర్స్ డే సెలబ్రేషన్స్ కి ఎడిసన్ నగర మేయర్ శామ్ జోషి హాజరవడం విశేషం. షాపింగ్ స్టాల్ల్స్, ఫోటోబూత్ మరియు ర్యాఫుల్ బహుమతులతోపాటు సరదా కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోనున్నాయి.

డిన్నర్ మరియు ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఈ మదర్స్ డే కార్యక్రమానికి రెజిస్ట్రేషన్ తప్పనిసరి. పైన ఫ్లయర్లో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి సులభంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు తానా న్యూజెర్సీ చాప్టర్ ప్రాంతీయ కార్యదర్శి వంశీ వాసిరెడ్డి @ 860-805-5406 ని సంప్రదించండి.

https://www.youtube.com/shorts/PyYQgxic6Hc

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected