Connect with us

Events

షార్లెట్ తానా మదర్స్ డే ప్రత్యేకం – మే 6 న అమ్మకు నీరాజనం

Published

on

పేగు తెంచి నొప్పి భరించి ప్రాణంబు నిచ్చే ఒక తత్త్వం. మనిషిని చేసి గుణమును మలచే మరో తత్త్వం. సకలమిచ్చి హితమును పెంచే ఇంకో తత్త్వం. ఇలా అన్ని తత్వాలలో కనిపించేదే అమ్మ తత్త్వం. అందుకే అమ్మ తత్వాన్ని వర్ణించడానికి మాటలు చాలవు అంటారు. అంతటి గొప్ప తత్వాన్ని బోధించే అమ్మకు నీరాజనం పలికేలా తానా అపలాచియన్ చాప్టర్ మదర్స్ డే ని నిర్వహిస్తున్నారు.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మహిళల కోసం నిర్వహించే కార్యక్రమాలలో మదర్స్ డే ప్రత్యేకమైనది. అందుకే తానా అపలాచియన్ ప్రాంత రీజినల్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి మరియు విమెన్ ఎంపవర్మెంట్ ఛైర్ మాధురి ఏలూరి మే 6 న షార్లెట్ లో మదర్స్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడానికి చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరితోపాటు స్థానిక తానా నాయకత్వం శ్రీనివాస్ చందు గొర్రెపాటి, పురుషోత్తమ చౌదరి గుదె, ఠాగూర్ మల్లినేని మరియు సమన్వయకర్తలు ఝాన్సీ అబ్బూరి, జ్యోత్స్న గంటా, పద్మజ కొమ్మినేని, రూప తలశిల, వినీషా సాదినేని తదితరులు ఏర్పాట్లలో పాలు పంచుకుంటున్నారు.

https://www.youtube.com/shorts/GadnUNrCYbI

షార్లెట్ లోని ది ఆర్చిడ్ బ్యాంక్వెట్ హాల్లో మే 6 శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సాగే ఈ మదర్స్ డే సెలెబ్రేషన్స్ లో ప్రముఖ టాలీవుడ్ ప్లేబాక్ సింగర్ సత్య యామిని, యాంకర్ & సింగర్ మధు నెక్కంటి మరియు ఫ్యాషన్ మోడల్ చైతన్య పోలోజు మిమ్మల్ని అలరించడానికి ప్రత్యేకంగా విచ్చేస్తున్నారు.

బాహుబలి, అఖండ, ఆలా వైకుంఠపురంలో, వకీల్ సాబ్, రాధే శ్యామ్, అరవింద సమేత వంటి అందరి తెలుగుసినీ హీరోల సినిమాల్లో తన పాటలతో రాక్ స్టార్ గా పేరొందిన టాలీవుడ్ ప్లేబాక్ సింగర్ సత్య యామిని తన గానంతో మంత్రముగ్ధులను చేయనుంది. యాంకర్ & సింగర్ మధు నెక్కంటి పాటలతోపాటు ఆర్ షుడ్ బి రోలింగ్ అంటూ మంచు లక్ష్మిని మరిపించడానికి రెడీ అవుతున్నారు. మోడల్ చైతన్య పోలోజు ఫ్యాషన్ రంగంలో మెళకువలు అందించనున్నారు.

https://www.youtube.com/shorts/YZrgQ_TPXZQ

వీటితోపాటు కళ్ళు మిరుమిట్లు గొలిపే డాన్సులు, స్కిట్లు, ఫ్యాషన్ షో, ఆట పాటలు, షాపింగ్ స్టాల్ల్స్, బోనాంజా లాంటి గోల్డ్ కాయిన్స్, డైమండ్ రింగ్స్, ఖరీదైన చీరలతో గ్రాండ్ ర్యాఫుల్ బహుమతులు, రిటర్న్ గిఫ్ట్స్, సర్ప్రైజ్ గిఫ్ట్ బాక్సులు ఇలా మరెన్నో హైలైట్స్ మహిళల కోసం ప్రత్యేకంగా రెడీ చేస్తున్నారు. చక్కని ఎంటర్టైన్మెంట్ తోపాటు నోరూరించే విందు భోజనంతో కూడిన ఈ మదర్స్ డే సెలెబ్రేషన్స్ కి టికెట్ కేవలం 50 డాలర్లు మాత్రమే. వినోదంతో సరదా సరదాగా సాగే ఈ ఈవెంట్ కి సీటింగ్ పరిమితం. కావున అందరూ త్వరగా టికెట్స్ కొనుక్కోవలసిందిగా మనవి. గ్రూప్ రిజర్వేషన్స్ కొరకు నాగ పంచుమర్తి @ 603-724-1437 లేదా మాధురి ఏలూరి @ 980-322-5177 లను సంప్రదించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected