Connect with us

Women

త్యాగానికి మారు పేరు మాతృమూర్తులు; ఘనంగా TANA Mother’s Day వేడుకలు @ Atlanta, Georgia

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) అట్లాంటా విభాగం ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు (Mother’s Day Celebrations) మే 10, శుక్రవారం రోజున జాన్స్ క్రీక్ లోని సంక్రాంతి రెస్టారెంట్ బాంక్వెట్ హాల్ లో వైభవంగా నిర్వహించారు. The Heart of the Home థీమ్ తో మహిళలకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

మాతృమూర్తుల నిస్వార్థ ప్రేమను కొనియాడుతూ నిర్వహించిన ఈ మదర్స్ డే (Mother’s Day Celebrations) వేడుకలలో సుమారు 300 మంది మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. తానా అట్లాంటా మహిళా (TANA Atlanta Women) జట్టుని వేదిక మీదకు ఆహ్వానించగా, శుభకరంగా ముందు జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ఘనంగా ప్రారంభించారు.

మహిళల నృత్య ప్రదర్శనలు, మామ్ & కిడ్ రీల్స్ పోటీలు, కహూట్, రాపిడ్ ఫైర్, మామ్ & కిడ్ డాన్స్ పోటీలు, ర్యాఫుల్ బహుమతులు మరియు ఆట పాటల వంటి సరదా కార్యక్రమాలు అందరినీ ఆహ్లాదపరిచాయి. వేదిక అలంకరణతోపాటు చక్కని ఫోటోబూత్ (Photo Booth) అట్లాంటా మహిళలను ప్రత్యేకంగా ఆకర్షించాయి.

హార్మొని హావెన్ ప్రోగ్రాం (Harmony Haven Program) గురించి తానా విమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ సోహిని అయినాల (Sohini Ayinala) చేసిన ప్రజంటేషన్ ఆహ్వానితులందరినీ ఆకట్టుకుంది. హార్మొని హావెన్ ని ప్రారంభించి అందరికీ ఇంట్రడ్యూస్ చేయడమే ఈ మదర్స్ డే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

ఈ సందర్భంగా సోహిని అయినాల ప్రసంగిస్తూ… మహిళల యోగక్షేమాలను పెంపొందించేలా హార్మొని హావెన్ (Harmony Haven) ఉపయోగపడుతుందని అన్నారు. మహిళలు కలిసిమెలిసి ఒకరికొకరు తోడ్పడేలా తమ అనుభవాలను పంచుకుంటూ అమెరికాలో సత్సబంధాలను పెంచుకోవచ్చు. సానుకూలత, ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యతను కల్పించేలా హార్మొని హావెన్ ఉంటుందన్నారు.

పలు జాతీయ, స్థానిక తెలుగు సంఘాల (Telugu Associations) ప్రతినిధులను వేదిక మీదకు ఆహ్వానించి సన్మానించారు. పసందైన విందు భోజనం అనంతరం మదర్స్ డే (Mother’s Day) ప్రత్యేకంగా కేక్ కట్ చేశారు. డాన్స్ ఫ్లోర్ (Dance Floor) ఓపెన్ చేయడంతో మహిళల ఆనందానికి హద్దే లేకుండా డాన్స్ చేశారు.

ఇంత చక్కని తానా (Telugu Association of North America) కార్యక్రమాన్ని ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా నిర్వహించడంలో మాలతి నాగభైరవ, పూలని జాస్తి, ఆర్తిక అన్నే, పావని గద్దె, లక్ష్మి సూర్యదేవర, ప్రియాంక గడ్డం మరియు మౌనిక బొబ్బ తదితరులు తానా (TANA) విమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ సోహిని అయినాల కి సహకరించారు.

ఈ TANA మదర్స్ డే (Mother’s Day Celebrations) కార్యక్రమానికి సంక్రాంతి రెస్టారెంట్ (Sankranti Restaurant) నుంచి కవిత కాట్రగడ్డ (Kavitha Katragadda) గ్రాండ్ స్పాన్సర్ గా మరియు పలువురు స్పాన్సర్స్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖ మహిళలను, స్పాన్సర్స్ ని సగౌరవంగా సత్కరించారు.

వివిధ పోటీల‌లో విజేత‌లుగా నిలిచిన మహిళలకు బ‌హుమ‌తులను అంద‌జేశారు. చివరిగా వందన సమర్పణ (Vote of Thanks) లో భాగంగా ఆహ్వానితులకు, స్పాన్సర్స్ కి, ఈ మాతృ దినోత్సవ వేడుకల (Mother’s Day Celebrations) నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected