Connect with us

Events

1500+ జనసందోహం నడుమ అంగరంగ వైభవంగా తానా Mid-Atlantic సంక్రాంతి సంబరాలు

Published

on

Mid Atlantic: సంక్రాంతి సంబరాలను చూడటానికి వచ్చిన జనసందోహం, మరోవైపు తమ ఆట, పాటలతో మైమరపింపజేసిన చిన్నారులతో తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన సంక్రాంతి (Sankranti) సంబరాలు సూపర్ హిట్టయింది. వెస్ట్ చెస్టర్ (West Chester) లో జనవరి 17వ తేదీన జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దాదాపు 1500 మందికిపైగా వచ్చిన జనసందోహం నిర్వాహకులకు, కళాకారులకు ఉత్సాహాన్ని ఇచ్చింది.

దానికితోడు సంక్రాంతి థీమ్ ను ప్రతిబింబించేలా చేసిన కార్యక్రమాలు, పోటీలు అందరిలోనూ పాల్గొనేలా చేశాయి. తానా మిడ్ అట్లాంటిక్ కు చెందిన బోర్డ్ డైరెక్టర్ రవిపొట్లూరి (Ravi Potluri) ఆధ్వర్యంలో తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు చిన్నారులు పాడిన సినిమా పాటలు ఎంతోమందిని అలరింపజేశాయి. యాంకర్లు శ్వేత కొమ్మోజి, మనీషా మేక కూడా కార్యక్రమాల విజయానికి తమవంతుగా వ్యాఖానాలను జోడించి ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు.

సాంప్రదాయ భోగిపళ్లు (Bhogi Pallu) కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు వారిపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు (Rangoli Competition), కిడ్స్ విలేజ్ థీమ్ కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్నవారిని తానా నాయకులు అభినందించారు.

ఇటీవల తానా మిడ్ అట్లాంటిక్ (TANA Mid-Atlantic) తన సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఫుడ్ బ్యాంకుల కోసం 7,000 పౌండ్లకు పైగా ఆహారాన్ని విరాళంగా సేకరించడంలో ప్రతిభ కనబరిచిన యువ వలంటీర్లను ఈ సంక్రాంతి వేడుకల్లో సత్కరించడం హైలైట్ గా నిలిచింది. వెస్ట్ వైట్ ల్యాండ్ టౌన్ షిప్ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ వైస్-ఛైర్ మిస్టర్ రాజేష్ కుంభార్దరే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి వలంటీర్లను సత్కరించారు.

తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి (Dr. Naren Kodali), తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తదితరులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ను అభినందించారు. ఈవెంట్ కోఆర్డినేటర్లు సురేష్ యలమంచిలి, కృష్ణ నందమూరితోపాటు మిడ్ అట్లాంటిక్ టీమ్ నాయకులు, వలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కషి చేశారు.

ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరించిన క్రాస్ రోడ్స్, గోల్డెన్ స్పాన్సర్స్ గా ఉన్న శ్రీధర్ అంచూరి (Sridhar Anchuri) మరియు సురేష్ బందుగులకు, కమలం ది డెకర్ కంపనీకి, అతిథులకు, వలంటీర్లకు కమ్యూనిటీ నాయకులకు, ఈ వేడుకకు సహకరించిన అందరికీ తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.

తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ (TANA Mid-Atlantic Team) సరోజ పావులూరి, దీప్తి కోక, మనీషామేక, శైలజ కస్తూరి, సునీత వాగ్వాల, మైత్రి నూకల, బిందు ఆలపాటి, రమ్య మాలెంపాటి, ఇందు సందడి, రాణి తుమ్మల, భవానీ క్రొత్తపల్లి, అనుపమ యలమంచి, భవానీమామిడి, నీలిమ వోలేటి, రవీన తుమ్మల, శ్రావణి రాయలతోపాటు, విశ్వనాథ్ కోగంటి, శ్రీధర్ సాధినేని, శ్రీకాంత్ గూడురు, గోపి వాగ్వాల, ప్రసాద్ క్రొత్తపల్లి..

మరియు కోటి యాగంటి, వెంకట్ ముప్పా, రమేష్ గుట్ట, శ్రీనివాస్ కోట, శ్రీనివాస్ అబ్బూరి, ప్రసాద్ కస్తూరి, రంజిత్ కోమటి, రంజిత్ మామిడి, మూర్తి నూతనపాటి, చందు భాతుస్కర్, సంతోష్ రౌతు, సత్య పొన్నగంటి, రాజు గుండాల, రాధాకృష్ణ మూల్పూరి, నాయుడమ్మ యలవర్తి, చలం పావులూరి, మోహన్ మల్ల ఈ వేడుకల విజయవంతానికి సహకరించారు.

error: NRI2NRI.COM copyright content is protected