Connect with us

Concert

సంగీత విభావరి @ తానా సంక్రాంతి వేడుకలు: జనవరి 29

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ సంక్రాంతి వేడుకలు జనవరి 29వ తేదీన నిర్వహిస్తున్నారు. తానా హారీస్‌బర్గ్‌ టీమ్‌ సహకారంతో జరిగే ఈ వేడుకలను ఆన్లైన్లో వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలలో లైవ్‌ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. టాలీవుడ్ ప్రముఖ గాయనీ గాయకులు సత్య యామిని, రఘురాం తమ పాటలతో అందరినీ ఆహ్లాదపరచనున్నారు. ప్రసన్న ఈ వేడుకలకు యాంకర్‌గా వ్యవహరించనున్నారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, సాంస్కృతిక కార్యదర్శి శిరీష తూనుగుంట్ల, మిడ్‌ అట్లాంటిక్‌ ప్రాంతీయ ప్రతినిధి సునీల్‌ కోగంటి, తానా ఫౌండేషన్‌ లైబ్రరీస్‌ కోఆర్డినేటర్‌ సతీష్‌ చుండ్రు, హారీస్‌బర్గ్‌ సిటీ కోఆర్డినేటర్‌ వెంకట్‌ చిమ్మిలి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. జనవరి 29వ తేదీ ఉదయం ఈస్ట్రన్ టైమ్‌లో 11.30 కి ప్రారంభమయ్యే ఈ వేడుకలను టీవీ ఏసియా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ వేడుకలను www.youtube.com/tvasiatelugu ద్వారా తిలకించవచ్చు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected