Connect with us

Picnic

ఉల్లాసంగా తానా మిడ్‌ అట్లాంటిక్‌ 15వ వార్షిక వనభోజనాలు @ Collegeville, Pennsylvania

Published

on

Collegeville, Pennsylvania: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మిడ్‌ అట్లాంటిక్‌ టీమ్‌ ఆధ్వర్యంలో పెన్సిల్వేనియాలోని కాలేజ్‌విల్లేలో సెప్టెంబర్‌ 20, 2025న నిర్వహించిన 15వ వార్షిక వనభోజనాలు సందడిగా సాగింది. వచ్చినవారంతా ఉల్లాసంగా, సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు ఆత్మీయంగా ఒకరినొకరు కబుర్లు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 1,800 మందికి పైగా హాజరయ్యారు. ఈ వేడుక తెలుగు సంస్కృతి, వంటకాలు, మరియు కమ్యూనిటీ స్ఫూర్తిని చాటిచెప్పింది.

కార్యక్రమంలో తానా అధ్యక్షుడు డాక్టర్‌ నరేన్‌ కొడాలి (Dr. Naren Kodali), తానా బోర్డ్‌ డైరెక్టర్‌ రవి పొట్లూరి, మిడ్‌-అట్లాంటిక్‌ రీజినల్‌ రిప్రెజెంటేటివ్‌ ఫణి కంతేటి, బెనిఫిట్‌ కోఆర్డినేటర్‌ వెంకట్‌ సింగు, న్యూయార్క్‌ రీజినల్‌ రిప్రెజెంటేటివ్‌ శ్రీనివాస్‌ భర్తవరపు, కమ్యూనిటీ నాయకులు సతీష్‌ తుమ్మల పాల్గొని ఈ కార్యక్రమం అందరిమధ్య అనుబంధాలను పెంచేలా సాగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ఫుడ్‌ డోనర్లకు, ఇతర స్పాన్సర్లకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. మణి కిచెన్స్‌, క్రాస్‌ రోడ్స్‌, నమస్తే ఇండియా, డెక్కన్‌ ఫ్లేవర్స్‌, మహక్ష, హెచ్‌బికె నోరిస్‌టౌన్‌, సదరన్‌ స్పైస్‌, ఫుల్టూ నోరిస్‌టౌన్‌, నల్లాన్‌, కిన్నెర, సాత్‌, సంగం, దోస్తీ బండి, అర్బన్‌ స్కూప్‌ లకు ధన్యవాదాలు తెలియజేశారు.

అలాగే కోకోరకో, వెల్త్‌ గార్డ్‌, ఎక్స్‌పీరియర్‌ ఫైనాన్షియల్‌ గ్రూప్‌, చుగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఆస్పైరింగ్‌ ఈగల్స్‌, రియల్‌ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ విఆర్‌ ఎ రియల్టర్‌, ఇంజామురి స్వామి రియల్టర్‌, టెస్లా రియల్టీ గ్రూప్‌, ఎవర్స్‌టెడ్‌ ఫైనాన్షియల్‌ హెల్త్‌ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్‌ చేశాయి.

వారి ఉదారత మరియు మద్దతు ఈ కార్యక్రమం విజయానికి ఎంతో సహాయపడ్డాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మధురమైన కార్యక్రమంగా మలచడానికి స్వచ్ఛంద కార్యకర్తల బృందం తెర వెనుక అవిశ్రాంతంగా పనిచేసింది. ఈ బృందంలో సునీల్‌ కోగంటి, కోటిబాబు యాగంటి, రాజు గుండాల, ప్రసాద్‌ క్రోతపల్లి, గోపి వాగ్వల, ప్రసాద్‌ కస్తూరి, చలం పావులూరి, విశ్వనాథ్‌ కోగంటి, రంజిత్‌ మామిడి, కృష్ణ నందమూరి ఉన్నారు.

అలాగే సురేష్‌ యలమంచి, నాయుడమ్మ యలవర్తి, రంజిత్‌ కోమటి, శ్రీని కోట, వెంకట్‌ ముప్ప, శ్రీనివాస్‌ అబ్బూరి, శ్రీధర్‌ సదినేని, రాధ ముల్పురి, సంతోష్‌ రౌతు, జాన్‌, రవి ఇంద్రగంటి, పవన్‌ నడిరపల్లి మరియు శ్రీకాంత్‌ గూడూరు ఉన్నారు. మహిళా బృందం: రాబోయే తానా దీపావళి లేడీస్‌ నైట్‌ గురించి వివరించింది. ఈ బృందంలో సరోజ పావులూరి, దీప్తి కోకా, మైత్రి నూకాల మరియు భవానీ క్రోతపల్లి కూడా ఉన్నారు.

ముగింపు కార్యక్రమంలో ఇటీవల నిర్వహించిన చెస్‌ పోటీల (Chess Competitions) విజేతలకు ట్రోఫీలను, మరియు స్వచ్ఛంద సేవకులకు వారి అవిశ్రాంత కృషిని గౌరవిస్తూ సర్టిఫికేట్‌లను సతీష్‌ తుమ్మల, ఫణి కంతేటి, సునీల్‌ కొగంటి, వెంకట్‌ సింగు, శ్రీనివాస్‌ భర్తవరపు, దిలీప్‌ ఎం మరియు ప్రసాద్‌ కోయి అందజేశారు.

తానా బోర్డ్‌ డైరెక్టర్‌ రవి పొట్లూరి (Ravi Potluri), టోర్నమెంట్‌ డైరెక్టర్‌ జోషువా ఆండర్సన్‌ (Joshua Anderson) అసాధారణ నాయకత్వానికి గుర్తింపుగా ఒక అవార్డును ఆయనకు అందజేశారు. వనభోజనాలు కార్యక్రమం గొప్ప విజయవంతం కావడానికి మరియు తానా లక్ష్యం అయిన తెలుగు సంస్కృతిని ఉత్తర అమెరికాలో పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి దోహదపడిన అందరికీ ఆయన హృదయపూర్వక ప్రశంసలు తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected