Mid-Atlantic: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆగస్టు 9న ఎక్స్ టన్ లోని ట్రీ-బ్రిడ్జెస్ చెస్ క్లబ్ లో నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ చెస్ టోర్నమెంట్ (Chess Tournament) విజయవంతంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన యువ చెస్ ఆటగాళ్లను ఈ టోర్నమెంట్ ఒకేచోట చేర్చింది. యువ ఆటగాళ్ళు కనబరిచిన నైపుణ్యం, వ్యూహం, క్రీడాస్ఫూర్తి అందరినీ ఆకట్టుకుంది.
తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి (Dr. Naren Kodali), తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri), మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, తానా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ లింగ ప్రసాద్ చావ, తానా కమ్యూనిటీ నాయకులు సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, సతీష్ చుండ్రు ఈ చెస్ టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులను, నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడారు. తమ ప్రోత్సాహకరమైన మాటలతో వారిలో స్ఫూర్తిని నింపారు.
ట్రి-బ్రిడ్జెస్ చెస్ క్లబ్ (Tri Bridges Chess Club) ఈ టోర్నమెంట్ నిర్వహణలో కీలకపాత్ర పోషించింది. టోర్నమెంట్ డైరెక్టర్ జోషువా ఆండర్సన్, చెస్ ఈవెంట్ కోఆర్డినేటర్ నాయుడమ్మ యలవర్తి టోర్నమెంట్ నిర్వహణను అద్భుతంగా నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరించిన ఆస్పైరింగ్ ఈగల్స్ (Aspiring Eagles) సంస్థ అధినేత ఉదయ్ సుంకర గారికి తానా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
యువ ఆటగాళ్ళ ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆయన అందించిన సహకారం అభినందనీయమని పేర్కొంది. ఒక మంచి కారణం కోసం నిధులు సేకరించడమే కాకుండా, ఇతరులకు ఆదర్శంగా నిలిచిన రమ్య మాలెంపాటి (Ramya Malempati) ఆధ్వర్యంలోని యువ టీమ్ సభ్యులైన లౌక్య పావులూరి, శ్రుతి కోగంటి, మేధా యాగంటి, ప్రణవ్ కంతేటి, మన్వి క్రొత్తపల్లి, వర్షిణి లంక ని పలువురు అభినందించారు.
వారు తమ సేవల ద్వారా తోటి యువ వాలంటీర్లకు స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ రిజిస్ట్రేషన్ మరియు ఏర్పాట్లలో సహాయపడిన ధీరజ్ యలమంచి, వ్యోమ్ క్రొత్తపల్ల్లికి మరియు ఇతర యువ వాలంటీర్లకు తానా మిడ్ అట్లాంటిక్ (Tana Mid Atlantic) నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తానా మిడ్-అట్లాంటిక్ బృందం అవిశ్రాంతంగా శ్రమించింది. సునీల్ కోగంటి (Sunil Koganti), నాయుడమ్మ యలవర్తి, రంజిత్ మామిడి, సురేష్ యలమంచి, కోటి బాబు యాగంటి, చలం పావులూరి, విశ్వనాథ్ కోగంటి, రవితేజ ముత్తు, ప్రసాద్ క్రొత్తపల్లి వంటి వాలంటీర్లు టోర్నమెంట్ ఏర్పాట్ల నుంచి ముగిసేవరకు ప్రతి విషయాన్ని చూసుకుంటూ తమ సమయాన్ని, కృషిని అందించి విజయవంతం చేశారు.
సతీష్ తుమ్మల, ఫణి కంతేటి మరియు మిడ్-అట్లాంటిక్ (Mid-Atlantic) బృందం ఆటగాళ్లకు, వాలంటీర్లకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. వారి కృషిని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి కమ్యూనిటీ కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. రేటెడ్ మరియు అన్రేటెడ్ విభాగాలలోని విజేతలను తానా కమ్యూనిటీ స్ఫూర్తి బలాన్ని
మరియు యువత నిబద్ధతను ప్రతిబింబించేలా శక్తివంతమైన ప్రభావవంతమైన టోర్నమెంట్ ను నిర్వహించిన మిడ్ అట్లాంటిక్ తానా (Mid Atlantic Tana) టీమ్ ను తానా బోర్డు సభ్యుడు రవి పొట్లూరి (Ravi Potluri) అభినందించారు. ఈ ఈవెంట్ కమ్యూనిటీ నాయకుల కృషిని మరోసారి తెలియజేసిందన్నారు.