డిసెంబర్ 19వ తేదీన ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామంలో తానా, విజయవాడ రోటరీ హాస్పిటల్ సంయుక్తంగా తానా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ శిబిరంలో సుమారు నాలుగువందలకు పైగా కంటి పరీక్షలు నిర్వహించి 93 మందికి కళ్ళ జోళ్ళు పంచారు. అలాగే 77 మందికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించారు. దీంతో ఈ వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది.
తానా మీడియా కార్యదర్శి ఠాగూర్ మల్లినేని ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి దాత. తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి సమన్వయ కర్త. ఈ కార్యక్రమాన్ని పెనమలూరు గ్రామ సర్పంచ్ భాస్కర్ లింగాల, సుధీర్ పాలడుగు, సుధీర్ కంచర్ల, నరేంద్ర బాబు మోర్ల, వరప్రసాద్ మరీదు, ప్రవీణ్ కిలారు తదితరులు పర్యవేక్షించారు.
తానా అధ్యక్షులు అంజయ చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ నేత్రుత్వంలొ చేస్తున్న సేవలను గ్రామస్తులు కొనియాడారు. ఎప్పటిలానే పుట్టిన ఊరుని మర్చిపోకుండా తన గ్రామస్తుల కొరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్పాన్సర్ చేసిన ఠాగూర్ మల్లినేని గ్రామ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.