Connect with us

Health

తానా మెగా ఐ క్యాంప్: అభినందించిన కృష్ణా జిల్లా రేమల్లె గ్రామవాసులు

Published

on

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా రేమల్లె గ్రామంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మరియు విజయవాడ రోటరీ హాస్పిటల్ సంయుక్తముగా డిసెంబర్ 4న మెగా ఐ క్యాంప్ నిర్వహించారు. ఈ మెగా ఐ క్యాంప్ కార్యక్రమానికి తానా కమ్యూనిటీస్ సర్వీస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి స్పాన్సర్ చెయ్యగా, తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుడె మరియు రేమల్లె గ్రామ వాస్తవ్యులు సూర్యనారాయణ కలపాల సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

సుమారు నాలుగువందల మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళ జోళ్ళు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, కమ్యూనిటీస్ సర్వీస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి లను రేమల్లె గ్రామస్తులు ఘనంగా సత్కరించారు.

error: NRI2NRI.COM copyright content is protected