తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America – TANA) మరియు మంచి పుస్తకం ఆధ్వర్యంలో బాల సాహిత్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పదేళ్ల వయస్సు లోపు ఉన్న పిల్లల కోసం తెలుగులో బొమ్మల కథల పుస్తకాలు అనే పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా 2023 సంవత్సరానికి గాను మొత్తం 83 రచనలు రాగా, అందులో 8 కథలను బహుమతులకు ఎంపిక చేశారు. గెలిచిన రచయితకి మరియు చిత్రకారులకి ఒక్కొక్కరికి 15 వేల రూపాయల నగదు బహుమతి తానా (TANA) వారు అందజేస్తారు. అలాగే వీటిని వచ్చే జులై లో ప్రచురిస్తారు.