Hyderabad, Telangana: డెట్రాయిట్‌లోని నోవై (Novi, Detroit, Michigan) లో జూలై 3 నుంచి 5వ తేదీ వరకు జరగనున్న తానా 24వ మహాసభలను పురస్కరించుకుని Telugu Association of North America (TANA) నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) గారిని కలిసి ముఖ్యఅతిధిగా మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వనించారు.
ఈ సందర్భంగా వారు మహాసభలకు సంబంధించిన వివరాలను, విశేషాలను, కమ్యూనిటీకి Telugu Association of North America (TANA) చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా తానాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ మహాసభలకు వస్తానని తెలియజేశారు.
TANA (Telugu Association of North America) కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ (Gangadhar Nadella), మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి (Jayaram Komati), తానా మహాసభల డైరెక్టర్ సునీల్ పాంట్ర (Sunil Pantra), చందు గొర్రెపాటి (Chand Gorrepati), శశి దొప్పాలపూడి (Shashi Doppalapudi), కన్నా దావులూరు (Kanna Davuluru) ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.