అమెరికాలోని గారీ, ఇండియానా (Indiana) మరియు ఇల్లినాయిస్(Illinois) రాష్ట్రాల మహిళా శరణాలయాల్లో తానా (Telugu Association Of North America) మరియు లీడ్ ది పాత్ ఫౌండేషన్ (Lead the Path Foundation) సంయుక్తంగా సేవా కార్యక్రమం నిర్వహించాయి.
ఈ కార్యక్రమం డా. ఉమా ఆర్. కటికి (Dr. Uma Aramandla Katiki), ఎన్‌ఆర్‌ఐ విద్యార్థుల సమన్వయకర్త, తానా, మార్గదర్శకత్వంలో మూడోసారి విజయవంతంగా 10-25-202న జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు శానిటరీ సరఫరాలు (Sanitary Supplies), ఆహారపదార్థాలు మరియు ఆర్థిక సహాయం అందజేశారు.
మహిళా శరణాలయాలు గృహహింస (Domestic Violence), నిరాధార పరిస్థితులు, లేదా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మహిళలకు (Women) తాత్కాలిక నివాసం, భద్రత, మరియు పునరావాసానికి సహాయాన్ని అందించే కేంద్రాలుగా పనిచేస్తున్నాయి.
తానా (Telugu Association of North America – TANA) మరియు లీడ్ ది పాత్ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, “మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటమే మా సేవా కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం” అని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లు (Volunteers), దాతలకు, తానాలీడర్షిప్ (TANA Leadership) కి, మరియు లీడ్ ది పాత్ ఫౌండేషన్ (Lead the Path Foundation) లీడర్షిప్ కి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.