Amaravati, Andhra Pradesh: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (North America Telugu Association – TANA) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలు ఈసారి జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డెట్రాయిట్ సబర్బ్ నోవై (Novi, Detroit) లో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో జరగనున్నాయి.
తానా 24వ ద్వై వార్షిక మహాసభలను (Convention) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారిని తానా కాన్ఫరెన్స్ నాయకులు కలిసి మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తానా (TANA) కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ, మాజీ అధ్యక్షులు, ఎన్నారై టీడిపి నాయకులు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శ్రీనివాస్ నాదెళ్ళ, గిరి వల్లభనేని, ఎన్నారై గుడివాడ ఎమ్మెల్యే రాము వెనిగండ్ల (Ramu Venigandla) తోపాటు ఇతరులు పాల్గొన్నారు.