Connect with us

News

అమరావతిలో ఆంధ్రప్రదేశ్ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడుకి TANA Convention ఆహ్వానం

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఆధ్వర్యంలో జులై 3 నుండి 5 వరకు అమెరికాలో మిషిగన్ రాష్ట్రం, నోవీ (Novi, Detroit, Michigan) నగరంలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ వేదికగా 24వ తానా మహాసభలు (Convention) నిర్వహించనున్నారు. ఈ మహాసభలకు గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu Chintakayala) గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు TANA ప్రతినిధులు ఆయన్ను మార్చి 19న అమరావతిలోని అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్ లో కలుసుకున్నారు.

ఈ సందర్భంగా తానా కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ గంగాధర్‌ నాదెళ్ళ, మాజీ అధ్యక్షులు జయరామ్‌ కోమటి (Jayaram Komati), కాన్ఫరెన్స్‌ డైరెక్టర్‌ సునీల్‌ పాంట్ర, చందు గొర్రెపాటి, శ్రీనివాస్‌ నాదెళ్ళ తదితరులు గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu Chintakayala) కి సభ వివరాలను తెలియజేసి, ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. తానా సంస్థ ఉత్తర అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ నార్త్ అమెరికా తెలుగు సమాజానికి సామాజిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో విశేష సేవలందిస్తోంది.

ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే తానా మహాసభలు (TANA Convention) భారతీయ వర్గాలలో అతిపెద్ద సదస్సులలో ఒకటిగా నిలుస్తాయి అని ఈ సందర్భంగా TANA మహాసభల చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ (Gangadhar Nadella) అన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక, వ్యాపార, ఆధ్యాత్మిక, రాజకీయ, వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర రంగాల్లో పేరుపొందిన ప్రముఖులు, కళాకారులు, రచయితలు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొంటారు.

ప్రతిసారి దాదాపు 10,000 మందికిపైగా తెలుగు ప్రజలు ఈ మహాసభలకు (Convention) హాజరవుతారు అని వారు తెలిపారు. గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu Chintakayala) హాజరు వల్ల మహాసభలకు మరింత మన్నన లభిస్తుందని, ఈ సందర్భంగా ఆయన్ను ఆహ్వానించడాన్ని తాము గౌరవంగా భావిస్తున్నామని తానా (Telugu Association of North America) ప్రతినిధులు తెలిపారు.