Connect with us

Volleyball

Columbus, Ohio: తానా ఒహాయో వ్యాలీ ప్రాంతీయ వాలీబాల్ టోర్నమెంట్ ఘన విజయం

Published

on

Columbus, Ohio: Telugu Association of North America (తానా) ఆధ్వర్యంలో ఒహాయో వ్యాలీ ప్రాంతీయ వాలీబాల్ టోర్నమెంట్ మార్చి 1న కోలంబస్‌లో ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది. తెలుగు యువత, క్రీడాకారులు, కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి (Dr. Naren Kodali) గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు (Srinivas Lavu) గారి నాయకత్వంలో తానా క్రీడా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. జాతీయ క్రీడా సమన్వయకర్త శివ చావా (Siva Chava) గారి మార్గదర్శకత్వంలో ఈ టోర్నమెంట్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఓహియో వ్యాలీ ప్రాంతీయ ప్రతినిధి ప్రదీప్ చందనం (Pradeep Chandanam) గారు సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు.

గత ఓహియో వ్యాలీ (Ohio Valley) ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాస్ సంగ గారు, శివ చావా గారు, నాగేశ్వరరావు మన్నె గారు, వీర ప్రతాప్ గారు, శ్రీకాంత్ రెడ్డి చింతొళ్ల గారు, మనోజ్ సిరిగిరెడ్డి గారు, చందు గుమ్మళ్ల గారు, శ్రీకుమార్ కాసా గారు, రాఘవ శ్రీహరి గారు, సురేష్ పార్వతి గారు, రాజేష్ గారు, వీరేష్ విల్లిగడ్ల గారు, శ్యామ్ దుద్దెల గారు, విప్పల రెడ్డి గారు, యశ్ కోసన గారు మరియు తేజ గారు తదితరులు హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు.

విజేతలు & రన్నరప్ జట్లు

డివిజన్ – 1 విజేతలు: Night Fury’s జట్టు – కెప్టెన్ ప్రకాశ్ కటకం

డివిజన్ – 1 రన్నరప్: Cleveland Setters జట్టు – కెప్టెన్ బాలా నెట్టెం

డివిజన్ – 2 విజేతలు: KMA జట్టు – కెప్టెన్ హర్ష పొలవరపు

డివిజన్ – 2 రన్నరప్: Volley Aces జట్టు – కెప్టెన్ రాంబాబు

విజేతలు మరియు రన్నరప్ జట్లకు ఆంధ్రా పీపుల్ ఆఫ్ సెంట్రల్ ఓహియో (Andhra People of Central Ohio) స్థాపక సభ్యుడు నాగేశ్వరరావు మన్నె గారు, మాజీ అధ్యక్షురాలు వాణి గడ్డె గారు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ సాయి బాబా దేవాలయం బోర్డు చైర్మన్ తేజో వట్టి గారు, శ్రీ వెంకటేశ్వర దేవాలయం అధ్యక్షుడు వెంకట్ కుసుమాంచి గారు..

ఆంధ్రా పీపుల్ ఆఫ్ సెంట్రల్ ఓహియో (Andhra People of Central Ohio) మాజీ అధ్యక్షుడు సుధాకర్ అల్వాల గారు, కమ్యూనిటీ నాయకులు శ్రీనివాస్ బొద్దు గారు, భరత్ జటప్రోలు గారు తమ మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సందర్భంగా ఓహియో వ్యాలీ ప్రాంతీయ ప్రతినిధి ప్రదీప్ చందనం గారు తానా (TANA) జాతీయ అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి గారు మరియు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు గారికి వారి ప్రోత్సాహం మరియు నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.

టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన సత్య నిమ్మల గారు మరియు గత ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాస్ సంగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. స్నేహభావం, ఐక్యత, క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో తానా నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలు అమెరికాలోని తెలుగు సమాజాన్ని మరింత దగ్గర చేస్తున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected