Connect with us

Cancer Screening

మురళి తాళ్లూరి సమర్పణలో ‘తానా’ ఉచిత కాన్సర్ నిర్ధారణ క్యాంపు – ఖమ్మం జిల్లా, కారేపల్లి

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, కారేపల్లి గ్రామంలో ఉచిత కాన్సర్ నిర్ధారణ క్యాంపు నిర్వహించారు. జూన్ 26 న గ్రేస్ కాన్సర్ ఫౌండేషన్ సమన్వయంతో నిర్వహించిన ఈ ఉచిత కాన్సర్ నిర్ధారణ క్యాంపును సుమారు 450 మందికి పైగా ఉపయోగించుకున్నారు.

తానా జాయింట్ సెక్రటరీ మురళి తాళ్లూరి ఈ ఉచిత కాన్సర్ నిర్ధారణ క్యాంపుకు సమర్పకులు. ఈ శిబిరాన్ని స్థానిక శాసనసభ సభ్యులు రాములు నాయక్, శాసనమండలి సభ్యులు మధు తాతా ప్రారంభించారు. మధు తాతా ఇంతకుముందు అమెరికాలో ఉన్నప్పుడు తానా సెక్రటరీగా సేవలందించడం విశేషం.

ఈ సందర్భంగా వీరిరువురూ మాట్లాడుతూ పుట్టి పెరిగిన గ్రామాన్ని మర్చిపోకుండా సేవలందిస్తున్న తానా జాయింట్ సెక్రటరీ మురళి తాళ్లూరి ని అభినందించారు. ఇలాగే చాలామంది ఎన్నారైలు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా సునీల్ సావిలి, శ్రీనివాస్ జరుగుల మరియు తెరాస నాయకులు పాల్గొన్నారు.

కారేపల్లి మరియు చుట్టుపక్కల సుమారు 8 గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఈ ఉచిత కాన్సర్ నిర్ధారణ క్యాంపును విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తానా సేవలను అభినందిస్తూ ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, ఫౌండేషన్ ట్రస్టీ విద్య గారపాటి మరియు తానా జాయింట్ సెక్రటరీ మురళి తాళ్లూరి తదితరులను కొనియాడారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected