తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ సేవాకార్యక్రమాల కొరకు బృహత్తర ప్రణాళిక రచించాం అంటున్నారు తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ. తానా ఫౌండేషన్ ఛైర్మన్ హోదాలో గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవాకార్యక్రమాలను నిర్వహించి ఈ మధ్యనే అమెరికా తిరుగు ప్రయాణం అయ్యారు.
వచ్చీ రాగానే ముందు ముందు నిర్వహించబోయే కార్యక్రమాల కోసం ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నామంటున్నారు. సుమారు 1 మిలియన్ డాలర్స్ రైజ్ చేసి ఫౌండేషన్ తరపున వివిధ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి దాతలను సంప్రదిస్తున్నారు. ఇందులో భాగంగానే డోనార్ కేటగిరీలో తానా సభ్యత్వం తీసుకునేలా పలువురిని ప్రోత్సహిస్తున్నారు. వీలు పడని వారిని ఎంతో కొంత దానం చేసి సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకోమని కోరుతున్నారు.
ఇదంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే తానా ఫౌండేషన్ చరిత్రలో ఒక కలికితురాయి అవుతుందనడంలో ఎటువంటి సందేహం అవసరంలేదు. మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఫౌండేషన్ కార్యక్రమాలను నిర్వహించడం రికార్డే అవుతుంది. ఇంతటి బృహత్తర కార్యక్రమ ప్రణాళిక అంతా కూడా సమిష్ఠి కృషే నంటూ తన తోటి కార్యవర్గాన్ని సైతం అందరినీ కలిపి అభినందిస్తున్నారు వెంకట రమణ యార్లగడ్డ.
తానా ఫౌండేషన్ నిర్వహించే సేవాకార్యక్రమాలు కొన్ని మచ్చుకు ఇవిగో. చేయూత, ఆదరణ, తోడ్పాటు, కంటి పరీక్ష క్యాంపులు, అన్నపూర్ణ, ఆరుణ్య, డిజిటల్ స్కూల్ లైబ్రరీస్, సీపీఆర్ ట్రైనింగ్ క్యాంపులు, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు, స్టెమ్ ఎడ్యుకేషన్ ప్రిపరేషన్, వారధి, బాలవికాస్ కేంద్రాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనకర సేవాకార్యక్రమాలు ఉన్నాయి. వీటిల్లో మీకు ఇష్టమైన కార్యక్రమానికి తోచినంత సహాయం చెయ్యాలనుకుంటే https://tana.org/foundation ని సంప్రదించండి. డొనేషన్స్ అన్నీ కూడా 501(C)3 టాక్స్ డిడక్టబుల్.